AMARAVATHI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

మార్చి 22న ఉగాది ఆస్థానం

 తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 22న ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారని చెప్పారు.ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారని, శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని వివరించారు. ఈ పరిమళాన్ని మన పూర్వీకులు ఎంతో కృషి చేసి మనకు వరంగా అందించారని చెప్పారు. పరిమళం ప్రోక్షణం ద్వారా క్రిమికీటకాలు రాకుండా ఆలయం పరిశుభ్రంగా ఉంటుందని, గోడలు పటిష్టంగా ఉంటాయని తెలిపారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, బుధవారం ఉగాది ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, విజివో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మార్చి 22న ఉగాది ఆస్థానం:- శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

8 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

9 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

13 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

14 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

15 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

1 day ago

This website uses cookies.