కోటంరెడ్డి.గిరిధర్ రెడ్డి కాలకూట విషం వున్న పాము లాంటి వాడు,టీడీపీ కార్యకర్తలు జాగ్రత్త-విష్టువర్దన్ రెడ్డి
నెల్లూరు: నా పైన డిశంబరు 4వ తేదిన జరిగిన హత్యయత్నంలో నెల్లూరు రూరల్ రెబల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి.శ్రీధర్ రెడ్డి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని,,గిరిధర్ రెడ్డిని A1 ముద్దాయిగా చేర్చాలని వైసీపీ రూరల్ బూత్ కమిటీల ఇంచార్జ్ బోడుమల్ల.విష్ణువర్ధన్ రెడ్డి పోలీసు అధికారులను కోరారు.గురువారం కస్తూరిదేవి గార్డెన్ ఠాగూర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన మీడియీ సమావేశంలో అయన మాట్లాడుతూ రేపు(శుక్రవారం) తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ఈ డమ్మీ నాయకుడు కాలకూట విషం నింపుకున్నపాములాంటి వాడని,,టీడీపీ నాయకులను, టీడీపీ కార్యకర్తలను కాటేస్తాడని హెచ్చరించారు..ఇతని కాలు మోపేడంటే,అక్కడ అన్ని విషాదలే అని అన్నాడు..గిరిధర్ రెడ్డి సంపాదించిన అక్రమ ఆస్తులు, అకృత్యాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల.రామకృష్ణరెడ్డికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.