DEVOTIONALDISTRICTS

శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు-ధ్వజారోహణం

శ్రీకాళహస్తీ: శ్రీకాళహస్తీశ్వరుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం స్వామి వారి ధ్వజారోహణం అత్యంత వైభవంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అష్టదిక్పాలకులను, బ్రహ్మ విష్ణువులను, సకల దేవతా ముని గణాలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణాన్ని నిర్వహించారు. పురవిహారం చేసిన పంచమూర్తులు ఆలయంలోని స్వామి వారి గర్భాలయం ముందు కొలువు తీర్చారు. వెండి అంబానీలలో అధిష్టింపజేసిన స్వామి అమ్మవార్ల ముందు కలిసి స్థాపన చేసి పూజలు చేశారు. త్రిశూలానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం వెలిగించి శాశ్వతంగా పూజలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం వృషభ ధ్వజాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టాపించి ప్రత్యేక పూజలు చేసి సకల దేవత గణాలను స్వాగతించారు. పన్నెండు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి విఘ్నాలు జరగకుండా నిర్విఘ్నంగా జరిగేలా చూడమంటూ పూజించారు. కర్పూర నిరాజనాలు అర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణలు మార్మోగాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *