AMARAVATHIDEVOTIONALHYDERABAD

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

అమరావతి: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి..గురువారం ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశంతో మొదలైన బ్రహ్మోత్సవాల్లో,,సాయంకాలం 5.30  గంటల నుంచి అంకురారోహణ,,అగ్ని ప్రతిష్ఠాపన,,7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు..నేటి నుంచి ఈ నెల 18వ తేది వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పంచహ్నదీక్షతో 7 రోజులపాటు ఘనంగా జరగనున్నాయి..7 రోజులుపాటు వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లు ప్రతిరోజు విశేష పూజలు అందుకోనున్నారు..యాగశాల ప్రవేశం,,వేదస్వస్థి,,శివసంకల్పం,,గణపతిపూజ,,పుణ్యాహవచనం,,చండీశ్వరపూజ,, వాస్తుహోమం,,మండపారాధనలు,,రుద్రకళశ స్థాపన,, వేదపారాయణాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు..శుక్రవారం నుంచి వివిధ వాహన సేవలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున  స్వామి ఆమ్మవార్లు భక్తులకు దర్శమివ్వనున్నారు..బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 18వ తేది వరకు ఆర్జిత, పరోక్ష సేవలైన రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయహోమం, సుబ్రహ్మణేశ్వర స్వామి కల్యాణం, స్వామి, అమ్మవార్ల కల్యాణం, ఏకాంత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు..

బ్రహ్మోత్సవాల సందర్బంగా రోజు వారీ సేవాలు:- బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు వాహన సేవలు,,,,13న భృంగి వాహనసేవ, 14న రావణ వాహన సేవ, 15న నంది వాహన సేవ.16న కైలాస వాహనసేవ, 18న అశ్వ వాహన సేవలు నిర్వహించనున్నారు.

14వ తేది భోగిరోజు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉచిత సామూహిక బోగిపండ్ల కార్యక్రమం నిర్వహించనున్నారు..15వ తేదిన మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం…17వ తేది ఉదయం యాగ పూర్ణాహుతి, కలశోద్వాసన, ల్రిశూల స్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ…18వ తేది రాత్రి జరిగే పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవలతో బ్రహ్మోత్సవాలు  ముగియనున్నాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *