AMARAVATHIPOLITICS

చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసన-శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: క్రిస్టియన్ సోదరుల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని,, కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లలో 3 సార్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకాలు పెట్టారని వైసీపీ రెబల్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ రూ.6 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కమ్యూనిటీ హాల్ కోసం అలసత్వం ప్రదర్శించారని అరోపించారు.. నాకు కొత్తగా సమస్యలు గుర్తొచ్చాయి అని అధికార పార్టీ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు..నాకు కొత్తగా సమస్యలు గుర్తు రాలేదని,,ఇప్పటి వరకు సీ.ఎం 3 సార్లు సంతకాలు పెట్టారని సంబంధిత G.O కాపీలను చూపించారు..కలెక్టర్ తో మాట్లాడి 150 అంకణాల స్థలాన్ని ఏర్పాటు చేసి శిలాఫలకం వేయడం జరిగిందన్నారు..కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరగక పోవడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని కోరారు..

అధికారపార్టీ ఎమ్మేల్యేగా వున్నప్పుడు సాధించలేని కమ్యూనిటీ హాల్ నిర్మాణం,,రెబల్ ఎమ్మేల్యేగా సాధిస్తారని అనుకుంటున్నారా అంటూ విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా అధికారులు, ముఖ్యమంత్రి చుట్టూ తిరిగడం జరిగింది,,అధికార పార్టీ నుంచి బయటకి వచ్చాక సమస్యలని వదిలేయాలని అనుకోలేవడం లేదని,,పోరాటం చేస్తునే వుంటానని అన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ నెల 8న ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంకి వాట్స్ యాప్, టెక్స్ట్ మెసేజెస్, పోస్ట్ కార్డ్ ద్వారా మెసేజెస్ పెడుతాం..తరువాత పదిరోజుల పాటు సిటీ, రూరల్ లో అన్ని చర్చిల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి మెసేజెస్ పంపిస్తామన్నారు..అయినా స్పందించకుంటే 18వ తేదీ తరువాత ఒక రోజు గాంధీనగర్ లోని కమ్యూనిటీ హాల్ స్థలం వద్దకి నగర, రూరల్ నియోజకవర్గాలలోని చర్చిల నుంచి ఒక్కో ఇటుక తీసుకెళ్లి భారీ నిరసనకు శ్రీకారం చేస్తామని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *