NATIONAL

సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయజెండా ఫొటో-మోదీ

అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమం దేశ వ్యాప్తంగా సామూహిక ఉద్యమంగా మారుతోందని,, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు..అదివారం 91వ మన్​కీ బాత్​ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన షహీద్ ఉధమ్ సింగ్​కు ఆయన నివాళులర్పించారు..ఆగస్టు 2వ తేది నుంచి 15వ తేది వరకు ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయ జెండా ఫొటోను వుంచాలని ప్రధాని మోదీ సూచించారు..ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘హర్​ ఘర్​ తిరంగా’ పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నాం..3 రోజులు పాటు ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోండి…భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన,,చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నాం..దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు..మువ్వన్నెల జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2వ తేదినే అని ప్రధాని గుర్తుచేశారు..త్రివర్ణ పతాక రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించినట్లు ఆయన స్మరించుకున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *