NATIONAL

జోషిమఠం విపత్కర పరిస్థితులను ప్రధానిమోదీ స్వయంగా పరివేక్ష్యిస్తున్నారు-సీ.ఎం ధామీ

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠం ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో నుంచి నీళ్లు పైకి రావడం,,అలాగే ఇళ్ల గొడలు పగుళ్లు రావడంతో,,ఈ విపత్తుకు గల కారణలను నిశితంగా పరిశీస్తున్నమని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చెప్పారు..ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యలను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పర్యవేక్షిస్తున్నరని,,జోషిమఠాన్ని కాపాడేందుకు అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని థామి తెలిపారు.. ఆదివారం సీ.ఎం జోషిమఠం ప్రాంతంలో పర్యాటించారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ  ప్రధాని మోడీ ఫోన్ చేశారు… ఈ విపత్తు వల్ల ఎంత మంది ప్రజలు ప్రభావితమయ్యారు.. ఎంత నష్టం జరిగింది…బాధిత ప్రజల నిర్వాసితుల కోసం ప్రభుత్వం ఇప్పటివరకు ఏమి చేసిందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు…బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయం అందించాలని ప్రధాని సూచనలు చేశారని ముఖ్యమంత్రి ధామి తెలిపారు…అలాగే కేంద్రం నుంచి కూడా అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణుల బృందం అధ్యయనం చేస్తొందని ముఖ్యమంత్రి ధామీ వెల్లడించారు..పర్వతాల మీద ఉన్న రాళ్లను మోసే సామర్థ్యం ఎంత అనే విషయంపై నిపుణులు, శాస్త్రవేత్తల బృందాన్ని రంగంలోకి దింపామన్నారు..మొత్తం ప్రాంతంలో అన్ని రకాల నిర్మాణ పనులు నిషేధించబడ్డాయని,, ఇప్పుడు నిపుణుల నివేదిక తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టులన్నింటినీ కొనసాగించడం లేదా వదిలివేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు..

ఈ విపత్తులో నష్టపోయిన ప్రజలకు ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల్లో వసతి కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది తాత్కాలిక ఏర్పాటని,,త్వరలో అన్ని కుటుంబాలకు ఆరు నెలల పాటు మరోచోట ఉండేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.. నెలకు రూ.4 వేలు చొప్పున అద్దె ఇస్తామని తెలిపారు..ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్ అకౌంట్ లో కోటి రూపాయలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు..నిర్వాసితులందరికీ పునరావాసం కోసం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించనున్నమని,,బాధితులకు శాశ్వత నివాసం కోసం తగిన భూములు వెతుకుతున్నామని తెలిపారు.. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పి.కె. మిశ్రా, పిఎంఓలో కేబినెట్ సెక్రటరీ, భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు,,  నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు…

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

11 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

13 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

16 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

17 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

20 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.