AMARAVATHINATIONAL

బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌ ఫారెస్ట్ ను సందర్శించిన ప్రధాని మోదీ

గున్నఏనుగు రఘు..

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటనల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఆదివారం కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌‌ లో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అటవీ అందాలను ఆస్వాదించారు..ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఖాకీ ప్యాంట్‌, కామోఫ్లాజ్‌ టి-షర్ట్‌, స్లీవ్‌లెస్‌ జాకెట్‌ ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు..ఈ టైగర్‌ రిజర్వ్‌ను సందర్శించిన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు..ప్రధాని మోదీ సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం..దీంతో పాటు ప్రధాని తమిళనాడు ప్రాంతంలోని మదులై ఫారెస్ట్‌ వెళ్లారు..ఇక్కడ తెపకాడు ఎలిఫాంట్ క్యాంపును సందర్శించారు..ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, వల్లి అనే ఏనుగులను ప్రధాని ఆప్యాయంగా స్పర్శించారు..అలాగే డాక్యుమెంటరీలోని రఘు అనే గున్నఏనుగు దగ్గరికి వెళ్లి దానిని ముద్దు చేసి,,చెరుకుగడలు తినిపించారు.

పులుల సంఖ్య పెరిగింది-ప్రధాని మోదీ:- మన దేశంలో పులుల సంఖ్య పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు..2018లో 2,967 పులులు ఉండేవని,, ఈ సంఖ్య 6.74 శాతం పెరిగి నేడు 3,167 పులులు వున్నాయన్నారు..ప్రాజెక్ట్ టైగర్ 50వ వార్షికోత్సవాల సందర్భంగా ఆదివారం కర్ణాటకలోని మైసూరులో ఈ గణాంకాలను ఆయన విడుదల చేశారు..స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో పులుల సంఖ్య పెరుగుదలపై విజన్ డాక్యుమెంట్‌ను మోదీ విడుదల చేశారు. రూ.50 స్మారక నాణేన్ని, భారత దేశంలో పులుల అభయారణ్యాల మదింపు నివేదికను కూడా విడుదల చేశారు. పులులు, చిరుతలు, సింహాలు, మంచు చిరుతలు, పూమాలు, జాగ్వార్‌లు వంటి ఏడు రకాల బిగ్ కేట్స్ సంరక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ కేట్ అలయెన్స్‌ ను మోదీ ప్రారంభించారు..ఈ కూటమిలో దాదాపు 97 దేశాలు ఉన్నాయి.. వాతావరణ మార్పులతో సహా అనేక రకాల ముప్పుల వల్ల ఈ జంతువులు అంతరించిపోకుండా నిరోధించడంపై ఈ కూటమి దృష్టి సారిస్తుంది..ఈ జంతువుల సంరక్షణకు ఆచరించదగిన చర్యలను నిర్ణయిస్తుంది..నిధులను కూడా సమకూర్చుతుంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *