NATIONAL

నూతన పార్లమెంట్ భవనంను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ అనుసరించే పద్దతి?

భారతీయు తెలుసుకోవాల్సిన చరిత్ర…

అమరావతి: ఒక పాలకుడి నుంచి మరొకరికి అధికార బదిలీని పవిత్రంగా,చట్టబద్ధంగా చేయడం ఎలా? అనే అంశంపై భారతదేశానికి చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ కు వచ్చింది..అధికారాన్ని అప్పగించడం అనే కార్యక్రమం ఎలా నిర్వహించాలి? వట్టి కరచాలనం చేయడం సరిపోదు,  మరి అవలంబించవలసిన పద్దతి ఏమిటి?..

మౌంట్ బాటన్ ఈ ప్రశ్నను జవహర్‌లాల్ నెహ్రూని అడిగారు.. నెహ్రు, ఆలోచించాల్సిన విషయమే అంటూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సి.రాజగోపాలాచారిని సంప్రదించారు..రాజాజీ యొక్క పాండిత్యాన్ని,,అతనికి తెలిసిన భారతీయ ఆచారాలు,,భారత నాగరికతలపై జ్ఞానం అంటే నెహ్రూకి నమ్మకం..రాజాజీ, నెహ్రూ వేసిన ఈ ప్రశ్నకు భారతదేశం యొక్క గతం నుంచి ఒక సమాధానం కనుగొన్నాడు..భారతదేశంలోని అత్యంత పురాతనమైన,,సుదీర్ఘమైన నిరంతర పాలనలలో ఒకటైన తమిళనాడులోని చోళ రాజ్యంలో, ఒక చోళ రాజు నుంచి మరొక చోళ రాజుకు అధికార మార్పిడికి ఒక కార్యక్రమం నిర్వహించడం చేసేవారు…చోళులు అమిత భక్తులుగా ఆరాధించే శివుని దీవెనలను కోరుతూ, ఆనాటి ప్రధాన పూజారిచే ఆశీర్వదించబడిన పద్ధతి అది.. 1000 సంవత్సరాలకు పైగా ఉన్న పురాతన దేవాలయాలలో ఆ పద్ధతి నేటికీ కొనసాగుతున్నాది.. అదే విధమైన వేడుక,,ప్రతీకలను అనుసరించాలని రాజాజీ సిఫార్సు చేస్తే నెహ్రూ దానికి అంగీకరించారు.

ఏమిటా తంతు (కార్యక్రమం) ?

ఒక పొడుగైన” రాజ దండం” అంటే ఇంగ్లిష్ లో ‘సెంగల్’ అంటారు. దానిని ఒక శుభ ముహూర్తం లో కొత్త రాజు లేదా పాలకునికి రాజ గురువు అందచేయడం.మరి 1947లో అధికార మార్పిడికి అనుసరించిన పద్దతి ఏది?.. 5 శతాబ్దాల క్రితం స్థాపించబడిన ప్రముఖ ధార్మిక మఠం అయిన తిరువా వడోతురై ఆధీనంలో అప్పుడు గల 20వ గురు మహాసన్నిధానం శ్రీల శ్రీ వినయంగారికి ఈ అధికార మార్పిడి చిహ్నమైన ఒక “రాజ దండాన్ని” (SENGOL) తయారుచేసే బాధ్యతని రాజాజీ అప్పచెప్పారు..ఆ స్వామీజీ మద్రాసులోని ప్రసిద్ధ స్వర్ణకారులు అయిన బొమ్మిడి వారికి బంగారంతో ఈ “రాజ దండం” అదే “సింగిల్” తయారీ పని అప్పగించాడు. ఈ రాజ దండం పొడవాటి గొట్టంలా గుండ్రంగా ఉండి, దానిపై భాగంలో బలం, సత్యం,,ధర్మానికి ప్రతీక అయిన ఒక నంది బొమ్మ ఉంటుంది. నేటికీ ఉన్న 96 ఏళ్ల బొమ్మిడి ఎతిరాజులు దీనికి సాక్ష్యం…

ఆగష్టు 14, 1947 రాత్రి ప్రత్యేక విమానంలో ఈ ప్రతినిధి బృందాన్ని,,నాదస్వర విద్వాన్ టి రాజరత్నం పిళ్లైని కార్యక్రమలను నిర్వహించేందుకు ఢిల్లీకి తరలించారు..ఈ బంగారు రాజదండం పవిత్ర జలంతో శుద్ధి చేయబడి, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లబడింది..ఆ ఊరేగింపులో తమిళ సెయింట్ తిరానా సంబందర్ స్వరపరిచిన తేవరంలోని కొల్లార పడిగం కీర్తనల నుంచి ఓడువర్ పద్యాలను పాడారు..ఈ క్రింది వాక్యాలను తమిళ భాషలో ‘రాజ దండం’ పై చెక్కించారు.

 “అడియార్‌గళ్ వాణిల్ అరసల్వార్, అనై నమదే”- అంటే..” భగవంతుని (శివుడు) అనుచరుడైన రాజు స్వర్గంలో ఉన్నట్లుగా పరిపాలించాలని మా ఆజ్ఞ.”

1000 సంవత్సరాల క్రితం నుండి, దక్షిణ మరియు ఉత్తరాల యొక్క అద్భుతమైన ఏకీకరణలో, దేశం ఒకటిగా ఆవిర్భవించినందుకు గుర్తుగా  నెహ్రూ,, రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఈ రాజ దండాన్ని మౌంట్ బాటెన్ నుంచి స్వీకరించారు..ఆ విధంగా అధికారం 1947లో దేశ జెండా ఎగుర వేయక ముందే ఈ దేశాన్ని పాలించే అధికార మార్పిడి ఇక్కడ ప్రాచీన నాగరికత పద్ధతి ప్రకారం ఒక చిహ్నంతో జరిగింది..ఈ కార్యక్రమం తరువాతే నెహ్రూ ఆగస్ట్ 14, 1947 అర్ధరాత్రి సమయంలో తన ప్రసిద్ధ ప్రసంగాన్ని చేశారు..ఈ సంఘటన ఆ రోజుల్లో స్థానిక,,అంతర్జాతీయ మీడియాలో వార్తలు ప్రచురితం అయ్యాయి..ఆగస్ట్ 25, 1947 టైమ్ మ్యాగజైన్ ఈ నివేదికను ప్రచురించింది..అంటే పూర్తి ప్రాచీన హిందూ సంప్రదాయం ప్రకారమే భారత దేశ పాలన ఇక్కడ పాలకులకు అందచేయబడింది..తరువాత కాలంలో ఈ బంగారు రాజ దండం ఏమయిపోయింది? అధికార మార్పిడికి ఆ పరంపర ఎందుకు కొనసాగించలేదు?

ఈ రాజదండం తరువాత కాలంలో ఏ పేరుతో ఎక్కడ భద్రపరిచారో తెలిస్తే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందో తెలుస్తుంది..ఈ రాజదండాన్ని తరువాత కాలంలో “నెహ్రు గారి నడకలో ఉపయోగించే వాకింగ్ స్టిక్ ” గా పేరు మార్చి ప్రయాగ్ రాజ్ మ్యూజియంలో భద్ర పరిచారు..మళ్ళీ 75 సం.ల తరువాత ఈ ‘రాజ దండానికి’ ప్రధాన మోడీ పునర్వైభవం తీసుకు వస్తున్నారు.

ఈ నెల 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు.. ఆ రోజు తేవారం వచనంలోని శైవ సంకీర్తనల మధ్య, తిరువడుతురై ఆధీనం మఠం అధిపతి ఈ 75 ఏళ్ల బంగారు రాజ దండంన్ని మే 28న ఉదయం 7.20 గంటల సమయంలో హోమం తరువాత ప్రధాని నరేంద్ర మోదీకి అందజేయనున్నారు..దాని తరువాత, తమిళనాడు నుంచి మఠాధిపతులు, నలుగురు ఊడువర్లు, ఒక మహిళతో సహా, కొత్త భవనంలోకి మోడీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి కాలినడకన వెళ్తారు..తిరువడుతురై అధీనం శ్రీల శ్రీ అంబాలవన దేశిక పరమాచార్య స్వామిగళ్‌తో సహా ప్రముఖులు మరియు మఠాధిపతులు పార్లమెంట్ వెల్‌లో నిలబడగా, స్పీకర్ కుడివైపున ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై ప్రధాన మంత్రి ఈ “రాజ దండం” ని ఏర్పాటు చేస్తారు..అంటే 1947, ఆగస్టు 14 రాత్రి ఎలా అధికార మార్పిడి వేడుక నిర్వహించారో మోడీ సరిగ్గా అటువంటి వేడుకే నిర్వహిస్తూ గత వైభవం గుర్తుకు తెస్తున్నారు..

బంగారు రాజదండంను ఆభరణాలు పొదిగించబడిందని, అప్పటి విలువ రూ.15,000 అని, చెన్నైకి చెందిన వుమ్మిడి బంగారు చెట్టి అండ్ సన్స్ పేర్కొంది. వుమ్మిడి బంగారు చెట్టి కుటుంబం తామే సెంగోల్‌ను తయారు చేసినట్లు ధృవీకరించారు. దీన్ని తయారు చేసిన కుటుంబంలోని పెద్ద 95 ఏళ్లు పైబడినప్పటికీ, వివరాలను గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. అయితే, ఈ వేడుక ఫోటో వారి ఇంట్లో ఉన్నట్లు వర్గాలు తెలిపాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *