NATIONAL

ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సంచలనం సృష్టించిన సమీర్ వాంఖేడేకు క్లీన్ చిట్

కులంపై నింద నిజం కాదు..

సత్యమేవా జయతే..

అమరావతి: మహారాష్ట్రలో గత సంవత్సరం(అక్టోబరు,2021) క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ వాడుతున్న కేసులో హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో పాటు మరో 19 మంది ప్రముఖలను కుమారులను అరెస్ట్ చేసి సంచలనం సృష్టించిన నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ సమీర్ వాంఖేడ్ అందరికి గుర్తు వుండే వుంటాడు..అప్పటి ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న నావాబ్ మాలిక్,,జన్మత ముస్లిం అయిన సమీర్ వాంఖేడే,మధ్యలో కులం మర్చుకున్నడని,, అయన హిందువే కాదంటూ ఏకంగా అయన మతంను కూడా టార్గెట్ చేస్తు,,విధుల నుంచి తప్పించడమే కాకుండా,, ఎంక్వయిరీ వేసింది అప్పటి థాక్రే ప్రభుత్వం..సమీర్ కెరీర్ పై దెబ్బకొట్టింది..అప్పటి నుంచి వాంఖేడే ఎంక్వయిరీ ఎదుర్కొంటూన్నారు..

ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న ముంబై కుల ధృవీకరణ కమిటీ శుక్రవారం తాజాగా నివేదిక ఇచ్చింది..తాజా నివేదికలో సమీర్ వాంఖడే జనతః ముస్లిం కాదని నిర్ధారణకు వచ్చింది.. వాంఖడే వద్ద ఉన్న కుల ధృవీకరణ పత్రాన్ని కూడా కమిటీ సమర్థించింది..91 పేజీల ఆర్డర్‌లో,, ప్యానెల్ గతంలో నమోదైన అన్ని వాదనలను తిరస్కరించింది..సమీర్ వాంఖడే,అతని తండ్రి ద్యానేశ్వర్ వాంఖడే హిందూ మతాన్ని త్యజించలేదని,,ముస్లిం మతాన్ని స్వీకరించారని కూడా కమిటీ నిర్ధారించింది..

సమీర్ వాంఖడే, ఆయన తండ్రి హిందూ మతంలో గుర్తించిన మహర్-37 షెడ్యూల్డ్ కులానికి చెందినవారని తాజా నివేదిక పేర్కొంది. దీంతో వెంటనే దీనిపై స్పందించిన వాంఖడే.. ట్విట్టర్‌లో “సత్యమేవ జయతే” అని పోస్టు పెట్టారు. మహారాష్ట్ర కేబినెట్‌ మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ సమీర్‌ వాంఖడే కులం సర్టిఫికెట్‌పై ఫిర్యాదు చేసిన మనోజ్‌ సంసారే, అశోక్‌ కాంబ్లే, సంజయ్‌ కాంబ్లే తదితర ఫిర్యాదులు తమ వాదనను సమర్థించలేకపోయాయని కమిటీ పేర్కొంది..

Spread the love
venkat seelam

Recent Posts

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

5 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

9 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

13 hours ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

1 day ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

1 day ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

1 day ago

This website uses cookies.