AMARAVATHI

శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 19 వరకు శ్రావణ మాసోత్సవాలు

అమరావతి: శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ నెల 17వ తేది నుంచి వచ్చేనెల 19వ తేది వరకు శ్రావణ మాసోత్సవాలు జరుగనున్నాయని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న వెల్లడించారు..శ్రావణ మాసోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాల మధ్య శ్రీశైలం దేవస్థానం అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు..క్యూ కాంప్లెక్స్,, దర్శనం క్యూ లైన్లు,, అర్జిత సేవా క్యూ లైన్లు,,శీఘ్ర దర్శనం,,అతి శీఘ్ర దర్శనం క్యూ లైన్లు,,విరాళాల సేకరణ కేంద్రం వద్ద వసతులను ఈవో లవన్న పరిశీలించారు..శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం, వివిధ ఆర్జిత సేవలకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని,, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలకు కూడా వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు..భక్తుల రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి వచ్చే నెల 15 వరకు (శ్రావణ మాసం ముగిసే వరకూ) వచ్చే శని, ఆది, సోమవారాలు, పర్వదినాలు, స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15), వరలక్ష్మి వ్రతం (ఆగస్టు 25), శ్రావణ పౌర్ణమి (ఆగస్టు 31), శ్రీ క్రుష్ణాష్ణమి (సెప్టెంబర్ 6) పర్వ దినాల్లో శ్రీ స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పూర్తిగా నిలిపివేశారు..అభిషేకాలు నిలిపేయడంతో ఈ నిర్దారిత రోజుల్లో రూ.500 ఫీజుతో శ్రీ స్వామి వార్ల స్పర్శ దర్శనానికి అనుమతి ఇచ్చారు.. ప్రతి రోజూ నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పిస్తారు..ప్రస్తుతం కొనసాగుతున్న విధంగానే భక్తులు స్పర్శ దర్శనం టికెట్లు,,ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ లోనే దేవస్థానం వెబ్ సైట్ నుంచి పొందాల్సివుంటుందని,,దేవస్థానం యాప్ నుంచి భక్తులు మరింత సులభతరంగా టికెట్లు పొందవచ్చన్నారు.. టికెట్ల లభ్యతను బట్టి ఒక గంట ముందు వరకూ ఆన్ లైన్ లో భక్తులు ఆయా టికెట్లు పొందేందుకు వీలు కల్పిస్తున్నది దేవస్థానం..ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు విధిగా ఆన్ లైన్ టికెట్ ప్రింట్ కాపీ వెంట తెచ్చుకోవాలి. ఆన్ లైన్ ద్వారా పొందిన టికెట్లు స్కాన్ చేసిన తర్వాతే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారికి అనుమతి ఇస్తారు..ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు తీసుకున్న వారు ఆధార్ కార్డు గుర్తింపు ప్రతి (ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ) వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది..ఆధార్ గుర్తింపు ప్రకారమే ఆర్జిత సేవాకర్తలు, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారిని అనుమతిస్తారు..భక్తులు టికెట్ ప్రింట్ కాపీ, ఆధార్ కార్డు ఒరిజినల్ తోపాటు ఆధార్ జీరాక్స్ కాపీ వెంట వుంచ్చుకోవాలి.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

4 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

10 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.