CRIMEHYDERABAD

పుష్పా సినిమా ప్రేరణతో హైదరాబద్ కు గంజాయి స్మగ్లింగ్

ఇదంతా షారా మాములే…

హైదరాబాద్: గంజాయిని స్మగ్లింగ్‌ చేసేందుకు ఒక్కొ ముఠా ఒక్కో పద్దతిని కనిపెడుతుంది..స్మగ్లర్స్ గుట్టు రట్టు కానంత వరకు హ్యపీగా స్మగ్లింగ్ సాగిపొతుంది..అలాగే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు..వచ్చిన సమస్య అంతా,,స్మగ్లర్స్ సరుకు కొనుగొలు చేసి,,తరలిచేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఆ ప్రాంతంలో వుండే ఇన్ ఫార్మర్ పోలీసులకు సమాచారం ఇస్తాడు…స్మగ్లర్స్ ను పోలీసులు పట్టుకుని,,మీడియా ముందు స్మగ్లర్స్ అట కట్టించినట్లు డప్పాలు కొడుతుంటారు..ఇదే సమయంలో మరో బ్యాచ్ స్మగ్లర్స్ ఇంకొ పద్దతిలో యధావిధిగా గంజాయి లేక డ్రగ్స్ ను సరఫరా చేస్తుంటారు..ఇక విషయంలోకి వస్తే,,,,హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చౌటుప్పల్‌ పోలీసులు అక్రమంగా గంజాయిని తరలిస్తోన్న ముఠాను అరెస్ట్ చేశారు…మీడియా సమావేశం నిర్వహించిన పోలీసుల కమీషనర్ DS చౌహాన్‌ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.. హనుమకొండకు చెందిన బానోత్‌ వీరన్న, హైదరాబాద్‌ కు చెందిన కర్రె శ్రీశైలం, కేతావత్‌ శంకర్‌ నాయక్‌, వరంగల్‌కు చెందిన పంజా సూరయ్యలు ముఠాగా ఏర్పడి,,గత కొంతకాలంగా మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నారు..ఆంధ్రప్రదేశ్ లోని అన్నవరం నుంచి రాజమండ్రి,,ఖమ్మం, తొర్రూరు, తిరుమల్‌గిరి, అడ్డగూడూరు, మోత్కూరు, వలిగొండ, చౌటుప్పల్‌ మీదుగా గంజాయిని తరలిస్తున్నారు..పోలీసులకు అనుమానంరాకుండా డీసీఎం వాహనం క్రింద భాగంలో కొన్ని ఖాళీ ఆరలు ఏర్పాటు చేసుకున్నారు..ఖాళీ ప్రదేశంలో గంజాయి ప్యాకెట్లను నింపి,, పైన ఇనుప షీట్లు ఉంచి బోల్టులతో బిగించారు..ఆ వాహనంలో ఇటుకలు,, కర్రలు వంటి ఏదో ఒక లోడును తీసుకుని నగరానికి వస్తుంటారు..చాలా కాలంగా ఈ దందా సాఫీగా సాగిపోతొంది..మార్గం మధ్యలో ఏదైన సమస్య వస్తే,,లొడ్ ను ఎక్కడైన ఆపివేసేవారు..అటు తరువాత నెమ్మదిగా వాళ్లు అనుకున్న ప్రాంతంకు చేరుకుని,,గంజాయిని డెలివరీ ఇచ్చేవారు..ఇందుకు పైలెట్ గా కారును పంపే ఏర్పాట్లు చేసుకున్నారు..మనం పైన చెప్పుకున్నట్లు,,,,,డీసీఎం వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న చౌటుప్పల్‌ పోలీసులు, శనివారం తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో చౌటుప్పల్‌లోని వలిగొండ చౌరస్తాలో ముందుగా పైలట్‌గా వచ్చిన కారుతోపాటు, డీసీఎంను కూడా పోలీసులు ఆపారు..వాహనాన్ని తనిఖీ చేసి,క్రింద బాగంలో వున్న ఇనుపషీట్లను తొలగించి చూడగా,అందులో వున్న 400 కిలోల గంజాయి ప్యాకెట్లు కన్పించాయి..వెంటనే కారు,వ్యాన్ ను  స్వాధీనం చేసుకున్నారు..కారు,, డీసీఎంలో వెళ్తున్న మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *