AMARAVATHI

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు 72 గంటల ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, బందోబస్తు విస్తరణ ప్రణాళిక అమలు మొదలైన ఎన్నికల అంశాలపై జిల్లా కలెక్టర్లు, IGలు,DIGలు,CPలు,SPలతో గురువారం సాయంత్రం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి DGP హరీష్‌కుమార్‌ గుప్తాతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్, ఎస్పీ హాజరయ్యారు.               ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌ క్లుప్తంగా వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో  వసతులను పూర్తిస్థాయిలో కల్పించామని, జిల్లాలో 75శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేశామని చెప్పారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి ముందస్తు అన్ని చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని చేజర్ల మండలంలోని పోలింగ్‌ కేంద్రాల్లో 100 శాతం వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. పోలింగ్‌కు ముందు చేపట్టాల్సిన అన్ని ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ:- జిల్లా ఎస్పీ ఆరీఫ్‌ హఫీజ్‌ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రతాచర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. నాలుగు బిఎస్‌ఎఫ్‌, నాలుగు తమిళనాడు ఆర్మ్‌ డ్‌ పోలీసు బృందాలు జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఫ్లయ్యింగ్‌ స్వ్కాడ్‌, స్టాటిస్టికల్‌ సర్వైవల్‌ బృందాలు, పోలీసు చెక్‌పోస్టుల ద్వారా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పార్శదర్శకంగా, స్వేచ్ఛగా ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని చర్యలను చేపడుతున్నట్లు సిఇవో ముఖేష్‌కుమార్‌ మీనాకు ఎస్పీ వివరించారు.

Spread the love
venkat seelam

Recent Posts

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 hour ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

2 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

20 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

This website uses cookies.