Categories: AMARAVATHIPOLITICS

కాపు-బీసీ కూలలు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమే-పవన్ కల్యాణ్

అమరావతి: కాపు-బీసీ కూలలు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమే అని,,ఈ కాంబినేషన్ ఉంటే ఏ పార్టీని దేహీ అని అడగాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు..శనివారం మంగళగిరిలో జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ కీలక వ్యఖ్యలు చేశారు..ఈ సందర్బంలో కాపు-బీసీ కూలలను ఉద్దేశించిన మాట్లాడుతూ…

కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం:- నేను కాపు నాయకుడిని కాదు..నేను కులం అనే ధోరణితో పెరగలేదు.. మానవత్వంతో పెరిగాను..కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు.. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను..కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం..ఈ కలయిక జరిగితే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు..రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే. పరిస్థితుల్లో మార్పు వస్తుంది.. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం..

బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు:- బీసీలంటేనే ఉత్పత్తి కులాలు…ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదు.. బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు..బ్యాక్ బోన్ క్లాస్..బీసీలకు ఇన్ని ఇచ్చాం.. అన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి..బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహీ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? బీసీల అనైక్యతే మిగిలిన పార్టీలకు బలం..బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత..పూలేను గౌరవించింది మనమే.. బీసీ సదస్సు అంటే ఇంతమంది వచ్చారు..కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీపీఐ అడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు..నేను బీసీల కోసం నిలబడతాను” అని పవన్ కల్యాణ్ అన్నారు..

బొత్స ఎదిగితే తూర్పు కాపులు పెరిగినట్టు కాదు:- నేను మాట్లాడితే నన్ను ఎస్సీ, బీసీ, కాపులతోనే తిట్టిస్తారు కాని రాజ్యాధికారం అనుభవించిన కులాలతో విమర్శలు చేయించరు..తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు..దీనిపై ఏపీ నుంచి ఎవ్వరూ మాట్లాడలేదు..ఏ బీసీ మంత్రి,, ఏ బీసీ ఎమ్మెల్యే కనీసం మాట్లాడలేదు.. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ కులాలను తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తప్పిస్తే ధర్మాన,, బొత్స లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడరు..? బొత్స ఎదిగితే తూర్పు కాపులు బాగుపడినట్లు కాదు కాదా అన్నారు..

టీటీడీ బోర్డులో సగం పదవులు బీసీలకే:- సంఖ్యా బలం లేని MBCల కోసం నేనేం చేయగలనో ఆలోచిస్తున్నా.. రూ.32వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు..బీసీలకు ప్రాధాన్యం అంటూ 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కారు స్టిక్కర్లకే పరిమితం చేశారు.. మేం అధికారంలోకి వస్తే TTD బోర్డులో సగం పదవులు బీసీలకే ఇస్తాంమంటూ పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు..నేను అన్ని కులాలను సమానంగా గౌరవిస్తా..ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే ప్రయత్నం చేశాను..కోనసీమలో కాపులు, శెట్టిబలిజ కులాలను కలిపే ప్రయత్నం చేశాను..బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలి. కోనసీమలో ఇప్పుడు బలమైన మార్పు చూస్తున్నాం..గోదావరి జిల్లాల్లో నాకు ఎక్కువగా బీసీ ఓట్లే పడ్డాయి..మత్స్యకారులు చాలామంది ఓట్లేశారు..నన్ను కాపు ప్రతినిధిగా చూడవాల్సిన అవసరం లేదు..ఆర్థిక పరిపుష్టి వస్తేనే రాజ్యాధికారం కచ్చితంగా వస్తుంది.. “:వైసీపీ, టీడీపీలకు ఆర్థిక పరిపుష్టే వారి బలం” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

18 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

19 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

23 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.