BUSINESSNATIONAL

స్టాక్ మార్కెట్ కింగ్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గుండెపొటుతో మృతి

అమరావతి: దేశీయ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు సంపాదించడం అందెవేసిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా(62)ను ముద్దుగా ఇండియన్ వారెన్ బఫెట్ అని పిలుచుకుంటారు..అలాంటి వ్యక్తి చాలా కాలంగా ఆనారోగ్యాలతో చికిత్స పొందుతూ,అదివారం ఉదయం బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో గుండెపోటుతొ మృతి చెందారు…ఝున్‌ఝున్‌వాలా చాలా చిన్న వయస్సు నుంచే స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనడం మొదలుపెట్టారని, పదమూడేళ్ల వయసులో మొదటిసారి పన్ను చెల్లించాడని చెప్పుకుంటారు..ఆయన పట్టిందల్లా బంగారమే అని,,సరైన షేర్లను గుర్తించడంలో ఆయనకు తిరుగులేదని,, ఆయన ఎంపిక చేసుకునే షేర్లు దాదాపు అన్నీ లాభాలు కురిపించినవే..ఇలా షేర్ మార్కెట్లో ఆయనకు దక్కిన విజయాలే ఝున్‌ఝున్‌వాలాను ఈ స్థాయిలో నిలపెట్టాయి..మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోనూ ఆయన అడుగుపెట్టారు. హంగామా డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్నారు..‘ఇంగ్లిష్-వింగ్లిష్’, ‘కీ అండ్ కా’, ‘షమితాబ్’ లాంటి హిందీ సినిమాలు కూడా నిర్మించారు..ఒక ఛానెల్‌ ఇంటర్వూలో నటి అలియా భట్‌తో మాట్లాడినప్పుడు షేర్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ‘‘మనం షేర్ మార్కెట్‌లో సర్దుకుపోయే స్వభావం లేకపోతే, దీనిలో విజయం సాధించలేం. ఇక్కడ మార్కెట్ మాత్రమే రాజు.. మార్కెట్లో రాజులు అంటూ ఎవరూ లేరు. షేర్ మార్కెట్లో రాజులు కావాలని ప్రయత్నించిన వారంతా ఆర్థర్ రోడ్ జైలుకు వెళ్లారు” అంటూ నిజాలు మాట్లాడారు..దేశీయ విమానయా రంగంలోకి అడుగు పెట్టిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా,,ఆకాష్ పేరుతో విమానసేవాలు ఈనెలలో ప్రారంభం అయ్యాయి..ప్రస్తుతం అయన ఆస్తి విలువ దాదాపు రూ.46వేల కోట్లు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *