DISTRICTS

నూతన సంవత్సరం సందర్బంగా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలి-కలెక్టర్

రహదారి భద్రత చర్యలు..

నెల్లూరు: జిల్లాలో రహదారి భద్రత చర్యలు కట్టుదిట్టంగా చేపట్టి, ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీలు జాతీయ రహదారుల్లో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి వాటి నివారణకు సూచిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు.కావలి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల నుంచి ఇంకా నివేదికలు అందలేదని వెంటనే ప్రమాదం జరిగే ప్రాంతాలు పరిశీలించి  సూచిక బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కందుకూరు మోచర్ల  రహదారి ప్రమాదంలో ఐదు మంది మృతి చెందారని బాధ్యులైన వారికి కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో 74 ప్రమాదాలు,,94 మరణాలు తగ్గాయని రహదారి భద్రత నియమాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేసి వాటిని మరింతగా తగ్గించాలన్నారు. ఈ సంవత్సరం జరిగిన 340 మరణాల కేసులలో 10 ప్రధానమైన కేసులను తీసుకొని వాటిని క్షుణ్ణంగా విశ్లేషించాలని మరణాలు తగ్గించడానికి కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి తీసుకొని రావాలన్నారు.బుజి బుజి నెల్లూరు, గొలగమూడి వద్ద  జాతీయ రహదారిలో పైవంతెనలు నిర్మాణాన్ని వెంటనే చేపట్టి త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రహదారి భద్రతా నియమాలు సూచిక బోర్డులపై సరైన అవగాహన కలిగించాలన్నారు.

జాతీయ రహదారులు ఆరువరుసల రహదారుల్లో ప్రతి 15 కిలోమీటర్ల జంక్షన్లో  సూచికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మకూరు బస్టాండ్ పై వంతెన నుండి సాయిబాబా దేవాలయం మార్గంలో ప్రమాదాలకు కారణమవుతున్నఉన్న ఆక్రమణలను తొలగించేందుకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలలో ఈనెల 31వ తేదీ రాత్రి నుంచి నిర్ణీత వేళల్లో నూతన సంవత్సర వేడుకలు  ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మనుబోలు జాతీయ రహదారి-16 మార్గంలో కల్వర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసి ప్రమాదాలు నివారించాలన్నారు. నగరంతో సహా అన్ని మున్సిపాలిటీలలో రద్దీ నివారణకు సిగ్నల్ పాయింట్లను గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.ప్రతి మంగళవారం రహదారి భద్రతపై బాగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అవి నిరంతరం కొనసాగాలని సూచించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

5 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

5 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

7 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

This website uses cookies.