NATIONAL

షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయండి-మధుర కోర్టు

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంలో సర్వే చేయాలని మధుర కోర్టు శనివారం ఆదేశించింది. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీనియర్ డివిజన్ కోర్టు ఈ కేసులోని అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని కోరింది..మధురలో కత్రా కేశవ్ దేవ్ ఆలయం పక్కనే ఉన్న షాహీ ఈద్గా మసీదుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గతంలో ఎన్నో హిందూ సంస్థలు కోర్టులో కేసులు దాఖలు చేశాయి.. హిందూ సేన సంస్థ జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా కూడా పిటిషన్ వేశారు..శ్రీ కృష్ణ పరమాత్ముడు జన్మించిన ప్రదేశంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని పిటిషనర్ విష్ణు గుప్తా ఆరోపించారు..మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆదేశాలతో 1669-1670 సంవత్సరాల  మధ్యకాలంలో కత్రా కేశవ్ దేవ్ ఆలయ పరిసరాల్లోని 13.37 ఎకరాల స్థలంలో షాహీ ఈద్గా మసీదును కట్టారని పిటిషన్ లో పేర్కొన్నారు..ఈ మేరకు అభియోగాలతో పిటిషనర్ విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేశ్ దూబే ఈ ఏడాది డిసెంబరు 8వ తేదిన  కోర్టులో వాదనలు వినిపించారు..శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్,, షాహీ ఈద్గా మసీదు కమిటీ మధ్య 1968  సంవత్సరంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు..ఆ అగ్రిమెంట్ అన్యాయమైందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు..ఈ వాదనల నేపథ్యంలోనే మధురలోని ఓ కోర్టు తాజా ఆదేశాలను జారీ చేస్తూ,,ఈ సర్వే నివేదికను జనవరి 20న సమర్పించాలని ఆదేశించింది.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.