AMARAVATHICRIMEHYDERABAD

శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది వేధింపులు భరించలేకున్న,సూసైడ్ నోటులో విద్యార్ది స్వాతిక్

హైదరాబాద్: శ్రీ చైతన్య కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది ఫీజులు,ర్యాంకులు, కొట్టడడం లాంటి ప్రవర్తనతో వేధిస్తున్నరని,,వాళ్ల వేధింపులను తట్టుకోవడం నా వల్ల కావడంలేదంటూ,,నార్సింగి శ్రీ చైతన్య క్యాంపస్‌లో సాత్విక్‌ అనే విద్యార్థి మంగళవారం రాత్రి సమయంలో క్లాస్‌రూంలోనే ఉరి వేసుకునే ముందు తన తల్లి,తండ్రులకు రాసిన సూసైడ్ నోటులో వుంది..బిడ్డ బంగారు భవిష్యత్ కోసం,ఎన్నో ఇబ్బందులు పడి మరి చదివిస్తున్న తల్లి,తండ్రులకు ఇది భరించలేని మనోవేదన..యాజమాన్యలు బిడ్డల చావులకు ఇంత అని ధర కట్టి,, చాలా సింపుల్ గా ఈలాంటి విషయాలను తేల్చివేస్తుంటాయి..క్యాంపస్ ల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే,,సంబంధిత యాజమాన్యలపైన 307 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేసి,,కఠిన చర్యలు తీసుకుంటే, బహుశ కొంత మేర అయిన ఆత్మహాత్యలు తగ్గుతాయి ఏమో..?

యాజమాన్యం తీవ్ర ఒత్తిడి వల్లనే అతను బలవన్మరణానికి పాల్పడ్డాడని విద్యార్థి తల్లిదండ్రులతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు…ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు కాలేజీ క్యాంపస్‌ దగ్గర ఆందోళనకు దిగారు.. సాత్విక్ ఆత్మహత్యపై విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తు, ఘటనపై విచారణ జరపాలని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు..

ఈ సంఘటనకు సంబంధించి శ్రీ చైతన్య కాలేజ్ యాజమాణ్యంపై IPC 305 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇందుకు సంబంధించి నాలుగురిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.. ఆచార్య, రమేష్,,కృష్ణరెడ్డి,,నరేష్ తో పాటు మరో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *