AMARAVATHIHYDERABAD

ఉగ్రవాదం,నక్సలిజంలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు-అమిత్ షా

హైదరాబాద్: సమాజంలో ఆలజడి సృష్టించే భావజాలతంతో నక్సలిజంలలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు..ఆదివారం హైదరాబాద్‌లోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) 54వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ దశాబ్దల కాలం క్రిందట అటు వైపు వెళ్లినవారిలో అనేక మంది ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తున్నారన్నారు.. ఉగ్రవాదం, నక్సలిజంలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు..సురక్షితమైన,, కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయాలు,, నౌకాశ్రయాలు లేకుండా ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదన్నారు..మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారని,,ఈ లక్ష్యంను సాధించడంలో CISF విభాగానిది చాలా ముఖ్యమైన ప్రాత వుందన్నారు..గతంలో వ్యవస్థాపక దినోత్సవాలు న్యూఢిల్లీలోనే జరిగేవని,,ఈసారి న్యూఢిల్లీ వెలుపల ఈ ఉత్సవాలు జరగడం ఇదే తొలిసారన్నారు..కేరళకు చెందిన ప్రాచీన మార్షల్ ఆర్ట్ కలరి విద్యా విన్యాసాలను మహిళలు ప్రదర్శించారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *