AMARAVATHINATIONAL

పంజాబ్ లో 24ల పాటు మొబైల్, SMS,ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వం

అమరావతి: ఖలిస్తానీ లీడర్,,వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను శనివారం జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు..అతనితోపాటు మరో ఆరుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు..అమృత్ పాల్ సింగ్ ను దాదాపు 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకుని,, రహస్య ప్రదేశానికి తరలించారనే వార్తలతో పంజాబ్ లోని ప్రత్యేక వేర్పాటు వాదులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు..పోలీసులు సైతం భారీగా మోహరించి,,చెదరగొడుతున్నారు..పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను,, SMS సేవలను నిలిపివేసింది..రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర హోం వ్యవహారాలు, న్యాయశాఖ ప్రకటించింది.. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృతపాల్ సింగ్ సవాల్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు చర్యలు ప్రారంభించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *