AMARAVATHINATIONAL

స్వచ్చంద రక్తదానం చేసిన ఒడిస్సా ప్రజల మానవత్వం మరిచిపోలేనిది-సీ.ఎస్.పీకే జెనా

అమరావతి: ఒడిస్సా లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మరణించిగా,,అంత కంటే ఎక్కువ సంఖ్య ప్రయాణికులు తీవ్రగాయాలు పాలైయ్యారు..ఒడిస్సా ప్రజలు చూపిన మానవత్వం దేశ ప్రజలు నమస్కరించేలా చేస్తొంది..గాయపడిన ప్రయాణికులను ఒడిస్సాలోని వివిధ ఆసుపత్రల్లో చికిత్స నిమిత్తం అధికారులు చేర్పించారు..ఒక్కసారిగా అంత మందికి చికిత్స అందించడం ఒక ఎత్తు అయితే అదే సమయంలో గాయాలు కారణంగా రక్తస్రావం అయిన వారికి రక్తం ఎక్కించాల్సి వుంటుంది..పరిస్థితిని గమనించిన దాదాపు 2 వేల మంది స్థానిక ప్రజలు రాత్రి సమయంలో బాలేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేరుకుని రక్తదానం చేశారు..అలాగే మిగిలిన ఆస్పత్రిలో కూడా వందల మంది స్థానికులు,, పోలీసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.. బాలేశ్వరలో అర్ధరాత్రి 500 యూనిట్లు రక్తం సేకరించగా మరో 900 యూనిట్ల రక్తం ఉందని వైద్యులు తెలిపారు.. రక్తదానం చేసేందుకు ప్రజలు ఇంకా తరలి వస్తున్నారని ఒడిస్సా ప్రభుత్వం వెల్లడించింది..ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన ప్రజలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు..క్లిష్ట సమయంలో స్వచ్ఛంద సేవకులు చేసిన రక్తం దానం మర్చిపోలేమంటూ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా కృతజ్ఞతలు తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *