HYDERABAD

వివేకానందరెడ్డి హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి-అవినాష్ రెడ్డి

సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దు..

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంత కాలం తాను మౌనంగా వున్నాను అని,,ఇక నుంచి అలా వుండదల్చుకోలేదంటూ వైఎస్ అవినాష్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు..ప్రతి ఒక్కరు తనను ప్రశ్నిస్తున్నరని,,ఇందుకు జవాబు చెప్పాల్సి అవసరం వుందన్నారు..శుక్రవారం సిబిఐ విచారణ అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డిది “మర్డర్ ఫర్ గైన్” కేసు అన్నారు.. వైఎస్ వివేకానంద రెడ్డికి 2006 నుంచి ఒక ముస్లిం మహిళలో అయనకు సంబందాలు వుననాయి..ఆమెకు పుట్టిన కుమారుడి పేరు షేక్.షహన్ షా అని,,అయన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నాడని చెప్పారు. ఆస్తులన్నీ వాళ్ళకి వెళ్లిపోతాయని, రాజకీయ వారసులుగా వస్తారని భావించిన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతమ్మ భర్త రాజశేఖర్ రెడ్డి కుట్ర చేశాడని “తన అనుమానమన్నారు”. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.తాను గుండెపోటు అని చెప్పలేదని, ఇదంతా టీడీపీ వాళ్ళు చిత్రీకరించారని ఆరోపించారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, తన సోదరి సునీతమ్మ హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసిందన్నారు. ఏ ఒక్కరోజూ తాను ఎవరి గురించీ మాట్లాడలేదన్నారు.తాను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారని అవినాష్ రెడ్డి తెలిపారు..ఇదే కేసులో అవినాశ్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హార్డ్ డిస్క్‌ లో వీడియో, ఆడియోలను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *