NATIONAL

కర్ణాటక సీ.ఎం ఎవరూ? 3 సభ్యుల పరిశీలకుల కమిటీ నివేదిక

అమరావతి: కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమైన ముగ్గురు సభ్యుల పరిశీలకుల కమిటీ ఆదివారం మద్యాహ్నం ఢిల్లీ చేరుకుంది.. సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి తీసుకున్న అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సోమవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందివ్వనున్నారని సమాచారం..మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,,కేపిసీపీ అధ్యక్షుడు డీకే శివకుమార్లలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో తెలియక అధిష్టానం సైతం తర్జనభర్జన పడుతోంది..ముఖ్యమంత్రి పదవిపై సిద్ధరామయ్య తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, మిగిలిన మూడేళ్లపాటు డీకే శివకుమార్ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని ప్రతిపాదనను సమర్పించినట్లు సమాచారం..తనకు వృద్ధాప్యం ఉన్నందున,,వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల వరకైనా తను కాంగ్రెస్ ప్రభుత్వాన్నితీసుకురావాలని కోరుకుంటున్నట్లు ఆయన సూచించారట..డీకే శివకుమార్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారని,, అందుకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోని సందర్భాలను ఉదహరించినట్లు తెలుస్తొంది..కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు అధికారం ఇస్తూ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *