DISTRICTSPOLITICS

 వైసీపీ ఎమ్మేల్యే ఆనం, ఆరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డుల నా పరిస్థితి వుంది

నెల్లూరు: రాపూరు నియోజకవర్గంలో జరగని అభివృద్ది పనులపై ఎమ్మెల్యే ఆనం.రామనారాయణ రెడ్డి తనదైన శైలీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాపూరులో వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్ల,ఐ ప్యాక్ ప్రతినిధితో సమావేశంలో పాల్గొన్న సందర్బంలో అయన మాట్లాడుతూ కనీసం రోడ్లు గుంతలు పూడ్చలేకపోతున్నామని,, త్రాగేందుకు మంచి నీళ్లు లేవు అంటే,, కేంద్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద నిధులు ఇస్తుందని అన్నారు..కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే మీరు (రాష్ట్ర ప్రభుత్వం) ఏం చేస్తున్నారంటూ ప్రజలు నిలదీస్తూన్నరని అన్నారు..గడిచిన నాలుగేళ్లలో ఏం పని చేశామని ఓట్లు వేయమని ప్రజలను అడగాలని ప్రశ్నించారు. ప్రాజెక్టులు ఏమైనా కట్టామా? తట్టడు పనైనా మొదలుపెట్టామా? శంకుస్థాపన ఏవైన చేసామా? ఏమని ఓట్లు అడగాలంటూ అవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇస్తే ఓట్లు వేసేస్తారా? గత ప్రభుత్వమూ పెన్షన్లు ఇచ్చిందని గుర్తు చేశారు..‘‘ఇల్లు కడతానంటూ…లే అవుట్లు వేశాం.. ఇల్లుల్లేమైనా కట్టామా?’’ అంటూ ప్రభుత్వంపై ఆనం రామనారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు..S.S కెనాల్ నిర్మిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని,,మూడున్నరేళ్లయిన,.కెనాల్ గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు. S.S కెనాల్ గురించి సీ.ఎం జగన్ కు ఎన్నొసార్లు చెప్పామని,,ఇదే విషయాన్ని అంసెబ్లీలోను ప్రస్తామించామన్నారు. S.S కెనాల్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వున్న చందన సామోతను గుర్తుకు తెస్తుందన్నారు..వైసీపీ సంక్షేమ,సమన్వయ కార్యకర్తలకు నమ్మకం కుదరడం లేదంటూ కుండబద్దలు కొట్టారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *