AMARAVATHI

12 Su-30MKI యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.10 వేల కోట్లు-రక్షణ మంత్రిత్వ శాఖ

అనుమతులు..
అమరావతి: భారత వైమానిక దళంను మరింత బలోపేతం చేసేందుకు,,కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా అనుమతి ఇచ్చింది..12 Su-30MKI యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కి రూ.10,000 కోట్ల టెండర్ ను జారీ చేసింది..భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది..
గత 20 సంవత్సరాల్లో 12 సుఖోయ్ యుద్ధ విమానాలు వివిధ సాంకేతిక కారణలతో దెబ్బతినడంతో ఏర్పడిన ఖాళీలను ఈ కొత్త విమానాల కొనుగోలుతో పూరించనుంది.. భారతదేశంలో ఈ విమానాలను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 60 శాతం స్వదేశీ వస్తువులతో తయారు చేయనుంది..ప్రస్తుతం భారతదేశం వద్ద 260 కంటే ఎక్కువ విమానాలు వుండగా,, ఈ కొనుగొలుతో ఇండియన్ ఎయిర్ ఫోర్సులోకి అత్యంత అధునాతన యుద్ధ విమానాలు చేరానున్నాయి..ఈ యుద్ధ విమానాలు ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, బ్రహ్మోస్ ఎయిర్ క్షిపణులు, బాంబులను మోసుకెళ్లగలవు..ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యంతో కూడిన ఈ విమానాలు లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ చేస్తాయి..రాఫెల్ ఫైటర్ జెట్ విమానాలతో పాటు బలమైన యుద్ధ విమానాలు భారత వైమానిక దళం అమ్ముల పొదిలోకి రానున్నాయి.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి భారత వైమానిక దళం సామర్ధ్యాన్ని పెంచుతుందని భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

13 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

15 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

19 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

19 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

23 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

2 days ago

This website uses cookies.