AMARAVATHI

కొటి ఇళ్లకు నెలకు 300 యూనిట్లు కరెంట్ ఉచిత పథకం-కేంద్ర ప్రభుత్వం

అమరావతి: దేశంలో కొటి ఇళ్లకు నెలకు 300 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇచ్చే పథకం అయిన పీఎం సూర్యఘర్‌ యోజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది..గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు..దేశవ్యాప్తంగా సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.. 2025 నాటికి ప్రతి కేంద్ర ప్రభుత్వ కార్యాలయం మీద రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు..రూఫ్‌టాప్‌ సోలార్‌ ఏర్పాటుకు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.. మీడియా సమావేశంలో కేంద్ర మంతి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ ఈ పథకంతో పేదలకు ఏడాదికి రూ.18 వేల వరకు లబ్ది చేకూరుతుందని ఈ పథకం క్రింద ఎంపికైన లబ్దదారులకు రూ.30వేలు-(1KW రూఫ్ టాప్ సోలార్),, రూ.60 వేలు (2KW రూఫ్ టాప్ సోలార్) చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుందని తెలిపారు..ఈ పథకం పేద,మధ్యతరగతి ప్రజల కరెంట్ బిల్లుల భారం తగ్గించేందుకు ఉద్దేశించిందన్నారు..ఈ పథకానికి రెసిడెన్షియల్ వినియోగదారులు,, గ్రూప్ హౌసింగ్ సోసైటీ సభ్యులు ఆర్హులు అవుతారు.. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు ఈ పథకానికి రూ.75021 కోట్ల నిధులు కేటాయించదని వెల్లడించారు.

అశ్విని వైష్ణవ్:- సెమీకండెక్టర్ పరిశ్రమల కోసం రూ.1.26 లక్షల కోట్ల విలువైన చిప్ ఎకోసిస్టమ్ కోసం సంచిత పెట్టుబడిని కేంద్రం ఈరోజు ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు…ధొలేరా యూనిట్ రూ.91,000 కోట్లు, అస్సాం యూనిట్ రూ.27,000 కోట్లు, సనంద్ యూనిట్ రూ.7,600 కోట్లుగా నిర్ణయించారు..12 క్లిష్టమైన,, వ్యూహాత్మక ఖనిజాలను ప్రభుత్వం గుర్తించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు..

ఖనిజాలు:- ఎరిలియం, కాడ్మియం, కోబాల్ట్, గాలియం, ఇండియం, రీనియం, సెలీనియం, టాంటాలమ్, టెల్లూరియం, టైటానియం, టంగ్‌స్టన్, వనాడియం.. రాయల్టీ రేటు నిర్దేశానికి నేటి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల దేశంలోనే తొలిసారిగా ఈ 12 ఖనిజాల బ్లాకులను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం వీలు కల్పిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

17 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

18 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

19 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

21 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

22 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.