AMARAVATHI

జిల్లాలో తీరం దాటక పోయిన,50 సంవత్సరాల తరువాత ఈ స్థాయిలో తుఫాన్ విధ్వసం

నెల్లూరు: మిచౌంగ్ తుఫాను జిల్లాలో తీరం దాటకపోయిన దాని ప్రభావం సోమవారం రాత్రి నుంచి తీవ్ర ప్రభావం చూపింది..దాదాపు 50 సంవత్సరాల తరువాత ఈ స్థాయి ఉపద్రంను జిల్లా వాసులు ఎదుర్కొన్నారు.. గాలుల తీవ్రత సోమవారం సాయంత్రం నుంచి పెరగడంతో,రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు..మంగళవారం వేకువజాము నుంచి భారీవర్షం ఒక వైపు 100 కిలో మీటర్ల వేగంతో వీచేగాలులు మరో వైపు..చెట్లు,,కరెంట్ స్తంభాలు నెలకొరిగాయి..మంగళవారం ఉదయం రోడ్లపైకి వచ్చిన వారికి ఎక్కడ చూసిన రోడ్లపై విరిగి పడిపోయిన పెద్ద పెద్ద చెట్లు,,కరెంట్ స్తంభాలు కన్పించాయి..జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మొబైల్ నెట్ వర్క్ లు ఆగిపోయాయి..

పూర్తిగా విఫలం అయిన కార్పొరేషన్ సిబ్బంది:- తుఫాన్ ప్రభావం నగరంపై ఎక్కువగా వుంటుందని,కమీషనర్ వికాస్ ఎంత మొత్తుకున్న కార్పొరేషన్ సిబ్బందిలో అ స్థాయిలో చలనం కన్పించలేదని స్పష్టంగా ఆర్దమైంది..కాలువల్లో పెరుకుని పోయిన పూడికలను పూర్తిగా తొలగించాలని కమీషనర్ అదేశాలు ఇస్తే,,శానిటరీ,,డ్రైనేజ్ సిబ్బంది,,చిన్న చిన్న వీధుల్లో,సందుల్లోని కాలువల్లో పూడికలు తీసేరే తప్ప,,నగరంలోని ప్రధాన మార్గల్లో వెళ్లే ఇరిగేషన్ కాలువల సంగతి పట్టించుకోలేదు..పర్యావసనం నగరం నడిబొడ్డున ఎక్కడ చూసిన మొకాలు లోతు నీరు నిలిచి పోయింది..

అండర్ బ్రిడ్జిలు:- నగరంలోని 4 ప్రధాన అండర్ బ్రిడ్జిలు నీటితో నిండిపోయాయి..ప్రతి సారి ఓ మోస్తారు వర్షం కురిసిన నీటమునిగిపోయే అండర్ బ్రిడ్జిల సంగతి అసలు పట్టించుకోలేదు..దింతో నగరంలోని తూర్పు వైపు నుంచి ప్రజలు ఆసుపత్రులకు రావలంటే రైల్వే ట్రాక్ దాటాల్సిందే.. అలాగే నగరం నుంచి తూర్పు వైపుకు వెళ్లాలంటే వీరు కూడా రైల్వే ట్రాక్ దాటాల్సిందే..దింతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు..అండర్ బ్రిడ్జిల వద్ద మోటర్లు పనిచేశాయా అంటే ?

యుద్ద ప్రతిపాదిక పనిచేసిన విద్యుత్ శాఖ:- తీవ్రమైన గాలులకు చెట్లు విరిగి కరెంట్ స్తంభాలపై పడడం,,కొన్ని దగ్గర్ల విద్యుత్ వైర్లు తెగిపడిపోవడంతో,,విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం అయింది..అయితే విద్యుత్ సరఫరాను  మంగళవారం సాయంత్రానికి అందించేందుకు,విద్యుత్ శాఖ సిబ్బంది యుద్ద ప్రతిపాదికన పనిచేసి సాయంత్రం 6 గంటలకు విద్యతు సరఫరాను పునరు:ద్దరించారు..

జిల్లా వ్యాప్తంగా:-మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సోమవారం నుంచి 100 కీమీ..వేగంతో గాలులు వీయడంతో అనేక చోట్ల చెట్లు నేలకు ఒరిగాయి,, విద్యుత్ సరఫరా నిలిపివేశారు..దీంతో కమ్యునికేషన్ వ్యవస్థలు చాలా వరకు పనిచేయలేదు..ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరు,,కావలి,, గూడూరు, సూళ్లూరుపేట నియోజక వర్గాలలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి..అనేక కాలనీలలో ప్రజలు ఆహారం,,త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు..గూడూరు లోని RTC బస్ స్టాండు పూర్తిగా నీట మునిగిపోయింది..దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను నిలిపివేసింది..జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల బొప్పాయి,,మిరపపంటలు దెబ్బతిన్నాయి.. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 హెక్టార్ల వరినారు వరదల వల్ల దెబ్బతిన్నట్లు ప్రాథమిక సమాచారం..అధికారులు రంగంలోకి దిగిలే కాని వాస్తవ పరిస్థితి తెలియదు..

Spread the love
venkat seelam

Recent Posts

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

3 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

17 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

23 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

2 days ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

2 days ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

This website uses cookies.