DISTRICTS

రాష్ట్ర విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు-సీ.ఎం జగన్

నెల్లూరు: ఈరోజు రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు వేస్తున్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ఏపీ జెన్‌కో స్వయంగా నిర్మించిన శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల ప్లాంటును ఈ రోజు మీ సమక్షంలో జాతికి అంకితం చేస్తున్నాను అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.గురువారం ప్రత్యేక హెలీకాప్టర్ లో ముత్తుకూరుకు చేరుకున్న సీ.ఎం APPDCL IIIయూనిట్ ను ప్రారంభించారు.అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వినియోగదారులందరికీ రోజంతా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ థర్మల్‌ పవర్‌ స్టేషన్లోని ఈ ప్రాజెక్టుకు రూ.3200 కోట్లు యుద్ధప్రాతిపదికన ఖర్చు చేశాం. 3 సంవత్సరాల 4 నెలల కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేశామన్నారు.రాష్ట్ర విద్యుత్‌ అవసరాలలో దాదాపు 45 శాతం కరెంటు ప్రభుత్వరంగ విద్యుత్‌ సంస్ధలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈరోజు జాతికి అంకితం చేసిన ఈ ప్లాంటు నుంచి రోజుకి 19 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఏపీ గ్రిడ్‌కు ఇక్కడ నుంచి సరఫరా అవుతుంది. సాధారణ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంటుతో పోల్చితే సూపర్‌ క్రిటికల్‌ ప్లాంటు తక్కువ బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల వెలువడే కాలుష్యం తగ్గుతుందని చెప్పారు.ఈకార్యక్రమంలో మంత్రులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

17 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

17 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.