DEVOTIONAL

తిరుమ‌ల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టిటిడి ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.ఈ సంద‌ర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు.ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ విష్వక్సేనుల వారి ఉత్సవమూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించిట్లు వివ‌రించారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మ‌వార్లు సహస్ర దీపాలంకరణ ‌సేవ‌లో పాల్గొని, ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఈ ఆస్థానంలో  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్ స్వామి, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డిఎల్వో రెడ్డెప్పరెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి, విజివో బాలిరెడ్డి, ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షితులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేవ్ పార్టీకి రింగ్ మాస్టారు కాకాణి-సోమిరెడ్డి

అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌ లో జరిగిన రేవ్ పార్టీలో…

1 hour ago

ఎన్నికల ప్రవర్తననియమావళి ఉల్లంఘన జరగకుండా చూడాలి-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…

1 hour ago

ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు-DRO

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…

2 hours ago

అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్

అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…

1 day ago

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

1 day ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 day ago

This website uses cookies.