AMARAVATHI

ప్రాంతీయ భాషలో విద్యనభ్యసిస్తే సులభంగా అభివృద్ధి సాధించవచ్చు-కేంద్ర మంత్రి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో పథకాలు మంజూరు చేసిందని,,ఇందులో బాగంగానే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని కేంద్ర విద్యా మరియు స్కిల్ డెవెలెప్ మెంట్ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు..శుక్రవారం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు.. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ యూనివర్సిటీ ఏర్పాటుతో గిరిజనుల భవిష్యత్ అద్భుతంగా మారుతుందన్నారు.. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.. అంతర్జాతీయ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు..రాష్ట్రాల్లో అధికారంలో ఇతర పార్టీలు వున్న,,కేంద్ర ప్రభుత్వ పరంగా తమకు అభివృద్ధే ముఖ్యమని,, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు..నూతన విద్యా విధానం మన భారతీయులకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు..ఈ సందర్భంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలను గురించి ప్రస్తావిస్తూ,,ప్రాంతీయ భాషలో విద్యనభ్యసిస్తే ఏ రంగంలోనైనా సులభంగా అభివృద్ధి సాధించవచ్చున్నారు..ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్,,విద్యాశాఖ మంత్రి బొత్స.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

 

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

15 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

15 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

20 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.