INTERNATIONAL

అమెరికాలో 7 సంవత్సరాలకు పైబడి నివసిస్తున్నావారికి గ్రీన్ కార్డు

అమరావతి: అమెరికాలో నివసించే భారతీయులకు బైడెన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. అమెరికాలో 7 సంవత్సరాలకు పైబడి నివసిస్తున్నావారికి H-1B వీసాపై ఐటీ సంస్థ‌లో ప‌ని చేస్తున్నవారు, గ్రీన్ కార్డ్‌ జారీ చేసేందుకు ఇమ్మిగ్రేష‌న్ యాక్ట్ ( US Immigration Act )లో స‌వ‌ర‌ణలు చేర్చారు. కొన్ని క్యాట‌గిరీల్లో ప‌ని చేస్తున్న భార‌తీయ టెక్ నిపుణుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ రూపొందించిన బిల్లును అమెరికా సెనెట్‌లో ప్రవేశ పెట్టారు. సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదించ‌గా,ఇత‌ర సెనెట‌ర్లు ఎలిజ‌బెత్ వారెన్‌, బెన్‌రాయ్ లుజాన్‌, డిక్ దుర్బిన్ మ‌ద్ద‌తు ప‌లికారు. అమెరికా ప్ర‌జా ప్ర‌తినిధుల స‌భ‌లోనూ కాంగ్రెస్ ఉమ‌న్ జో లాఫ్‌గ్రెన్‌ ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. జో లాఫ్‌గ్రెన్ ఇమ్మిగ్రేష‌న్ హౌస్ స‌బ్ క‌మిటీ చైర్‌గా ఉన్నారు.ఈ బిల్లు చ‌ట్టంగా మారితే ప్ర‌స్తుతం H-1B వీసాపై ప‌ని చేస్తున్న వారితో స‌హా 80 ల‌క్ష‌ల మందికి ల‌బ్ధి చేకూరుతుంది. ఇందులో H-1B వీసా దారులు, దీర్ఘ‌కాలం వీసాపై ప‌ని చేస్తున్న నిపుణుల పిల్లలు, గ్రీన్ కార్డు డ్రీమ‌ర్లు, త‌దిత‌రుల‌కు గ్రీన్ కార్డు ల‌భిస్తుంది.దేశాల వారీగా కోటా ప్ర‌కారం అమెరికా జారీ చేస్తున్న గ్రీన్ కార్డు కోసం సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న భార‌తీయ నిపుణులు అత్య‌ధికంగా ల‌బ్ధి పొందుతార‌ని భావిస్తున్నారు.ఒక అంచనా ప్రకారం అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు,అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంవత్సరానికి సుమారు USD 83 బిలియన్లు,,పన్నుల రూపంలో సుమారు USD 27 బిలియన్లు చెల్లిస్తున్నారు. ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లును సెనెట‌ర్ అలెక్స్ పాడిల్లా ప్ర‌తిపాదిస్తూ, అమెరికా ఎకాన‌మీకి వెన్నెముక‌గా ఉంటూ ఏళ్ల త‌ర‌బ‌డి గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న వారి ఆశ‌లు సాకారం చేసేలా మ‌న అప్‌డేటెడ్ ఇమ్మిగ్రేష‌న్ సిస్ట‌మ్ చ‌ర్య‌లు తీసుకుంటుంది. నేను ప్ర‌తిపాదించిన బిల్లుతో 35 ఏళ్లకు పైగా అమెరికాలో నివాసం ఉంటూ శాశ్వ‌త నివాసం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారందరికీ తొలిసారి ఇమిగ్రేష‌న్ రిజిస్ట్రీ,క‌టాఫ్ డేట్ అప్‌డేట్ చేస్తుంది. US Immigration స‌వ‌ర‌ణ బిల్లు చ‌ట్టంగా మార‌డానికి కొంత స‌మ‌యం ఉంది.తొలుత యూఎస్ సెనెట్‌, ప్ర‌జాప్ర‌తినిధుల స‌భ అంగీక‌రించి, ఆమోదించాలి. అటుపై అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఆ బిల్లుపై సంత‌కం చేయ‌డంతో చ‌ట్టంగా మారుతుంది.

Spread the love
venkat seelam

Recent Posts

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

8 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

14 hours ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

14 hours ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

1 day ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

2 days ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

3 days ago

This website uses cookies.