AMARAVATHI

హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్య

అమరావతి: “విధి” ఒక దాని తరువాత మరో కష్టలకు గురి చేస్తు ఎప్పుడు మనిషి జీవితంతో అడుకుంటునే వుంటుంది..అలాంటి కష్టలు ప్రతి ఒక్కరికి జీవితంలో ఎదురైవుతునే వుంటాయి..వాటిని తట్టుకుని నిలబడితేనే,,మనిషి జీవితం ముందుకు సాగుతుంది..ఇలాంటి సంఘటనే బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మ్యూజిక్ కంపోసర్,,హీరో విజయ్ ఆంటోని జీవితంలో పెను విషాదం రూపంలో చోటు చేసుకుంది..ఆయన కూమారై మీరా ఆత్మహత్య చేసుకుంది..మంగళవారం వేకువజామున చెన్నైలోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని తనువు చాలించింది..కుటుంబ సభ్యులు ఆమ్మాయిని ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజం లేకపోయింది..ఈ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు..ఇంత చిన్న వయసులోనే కూతురు మరణించడంతో విజయ్ ఆంటోని కుటుంబ, విషాదంలో మునిగిపోయింది..ఈ హృదయ విదారక సంఘటన విజయ్ కుంటుబానే కాదు,, మొత్తం సినిమా ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది..శరత్ కుమార్, రాఘవ లారెన్స్, వెంకట్ ప్రభు తదితర సినీ నటులు మీరా మృతికి సంతాపం తెలుపుతున్నారు..మీరా హఠాన్మరణానికి ఇంకా కారణం తెలియాల్సి ఉంది..ప్రస్తుతం మీరా చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్లో +2 చదువుతోంది..చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతోందని,,చికిత్స కూడా తీసుకుంటుందని సన్నిహితులు పేర్కొంటున్నారు..మీరా ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమా ?.. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది..విజయ్ ఆంటోని ఇంట్లో ఇలా ఆత్మహత్యలు జరగడం ఇదేమి మొదటిసారి కాదు..గతంలో విజయ్ ఆంటోనీ తండ్రి కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు..అప్పుడు విజయ్ ఆంటోనీ వయసు 7 సంవత్సరాలు..ఒక సందర్భంలో తన తండ్రి ఆత్మహత్యపై స్పందించిన విజయ్,,ఎంతో స్ఫూర్తి కలిగించే వ్యాఖ్యలు చేశాడు.. “జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. ఇంట్లో ఎవరైనా ఇలా చనిపోతే వారి పిల్లల గురించి తలుచుకుంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది.. మా నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు..అప్పుడు నా వయసు ఏడు సంవత్సరాలు..మా చెల్లికి ఐదేళ్లు..నాన్న ఆత్మహత్య మా వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది..నాన్న చనిపోయిన తరువాత మమ్మల్ని పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది..అందుకే ఆత్మహత్యలు గురించి విన్నప్పుడల్లా చాలా బాధేస్తోంది..నేను జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను..ఎన్నో ఇబ్బందులు పడ్డాను..అయితే ఆత్మహత్య గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించలేదు” అంటూ ఉద్వేగం మాట్లాడారు.

Spread the love
venkat seelam

Recent Posts

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

9 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

11 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

15 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

15 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

19 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

This website uses cookies.