AMARAVATHI

టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల: తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో సోమ‌వారం టీటీడీ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఇందులో తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి.

⁠స్విమ్స్‌ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు క్రియేట్‌ చేసేందుకు ఆమోదం.

– టీటీడీలో గ‌తంలో చాలామంది నోటిఫికేష‌న్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్‌(ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో ప‌రిపాల‌నా సౌల‌భ్యం కొర‌కు కాంట్రాక్టు/పొరుగుసేవ‌ల ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం జ‌రిగింది. జి.ఓ.నం.114 ప్ర‌కారం కొన్ని నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించి వారి సేవ‌లు క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప్ర‌భుత్వానికి నివేదిక పంపాల‌ని నిర్ణ‌యం.

  • ⁠ ⁠టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్‌ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్ట‌ళ్ల నిర్మాణానికి ఆమోదం.
  • ⁠ ⁠రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం.
  • ⁠ ⁠రూ.1.50 కోట్లతో బాలాజి నగర్‌ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్‌ కార్డన్‌ ప్రాంతంలో మిగిలిపోయిన ఫెన్సింగ్‌ ఏర్పాటుకు ఆమోదం.
  • ⁠ ⁠రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్‌, డి టైప్‌, కొత్త సి టైప్‌, డి టైప్‌ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆమోదం.
  • ⁠ ⁠తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథిస్వామి, శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం.
  • ⁠ ⁠టీటీడీ ఐటీ సేవల కోసం టైర్‌ 3 డేటా సెంటర్‌, డిజాస్టర్‌ రికవరీ సెంటర్‌ ఉన్నాయి. ఐటి స్టాండర్డ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాలి. ఇందులోభాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్‌ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం.
  • ⁠ ⁠టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక, పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 ఆధీనంలోకి తీసుకున్న ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల్లో అవసరమైన అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాల‌న అనుమ‌తికి ఆమోదం.
Spread the love
venkat seelam

Recent Posts

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

17 hours ago

రాష్ట్రపతి నుంచి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…

18 hours ago

టీవీ న‌టి జ్యోతిరాయ్ పర్సనల్ వీడియోలు అంటూ ట్రెడింగ్ అవుతున్న పోస్టు

అమరావతి: కర్ణాటకలో ఇటీవ‌లే ఎం.పీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెక్స్ స్కాండ‌ల్ ఓ కుదుపు కుదుపేస్తుండ‌గా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మ‌రో…

19 hours ago

జనవరిలో బటన నొక్కి ఇప్పుడు నిధులు ఎలా విడుదల చేస్తారు-ఈసీ

హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు…

20 hours ago

కాబిన్ సిబ్బంది బెదిరింపులపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌

అమరావతి: టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…

22 hours ago

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

2 days ago

This website uses cookies.