AMARAVATHI

భారత వైమానిక దళంలోకి C-295 రవాణా విమానం ప్రవేశం

అమరావతి: భారత వైమానిక దళంలోకి మరో మధ్యశ్రేణి రవాణా విమానం C-295 హిండాన్ ఎయిర్ బేస్ లో సోమవారం భారత వైమానిక దళం (IAF)లో చేరింది..రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్,,హ్యాంగర్ లో ‘సర్వధర్మ పూజ’ కార్యక్రమం నిర్వహించారు..(IAF) ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, IAF అధికారులతో పాటు ఎయిర్ బస్ కు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు..సెప్టెంబర్ 20న C-295 విమానం గుజరాత్ లోని వడోదరలో ల్యాండ్ కాగా సోమవారం పూజ కార్యక్రమాలు నిర్వహించారు..స్పెయిన్ లో ఈ విమానాలను వాయుసేనకు అప్పగించారు.. ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ అనే సంస్థతో ఈ విమానాల సేకరణకు రూ. 21,935 కోట్ల ఒప్పందం జరిగింది..గత సంవత్సరం అక్టోబర్ లో వడోదరలో C-295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్ధాపన చేశారు..మొత్తం 56 C-295 రవాణా విమానాలకు గాను16 విమాలను ఎయిర్ బస్ కంపెనీ తయారు చేసి పంపిస్తుంది.. 40 విమానాలను, రెండు కంపెనీల మధ్య పారిశ్రామిక భాగస్వామ్యంలో భాగంగా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) తయారు చేసి అసెంబుల్ చేస్తుంది.. హైదరాబాద్ లో ఈ విమానాల విడిభాగాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది..ప్రైవేట్ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్ లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్ ఇదే.. C-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరు వున్నది…ఈ విమానంలో 71 మంది సైనిక దళాలను, 50 పారాట్రూపర్లను చేరవేస్తుంది..పెద్ద రవాణా విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం C-295 ఎయిర్ క్రాఫ్ట్లు యుద్ధసామాగ్రిని, సైనికులను సులభంగా తరలిస్తాయి.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

21 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

21 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.