AMARAVATHI

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు,ఎల్లుండి భారీ వర్షాలకు అవకాశం-IMD

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న క్రమేపి తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. ద్రోణి ప్రభావం వల్ల ఈ నెల 20వ తేది నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఆవకాశం వుందని, తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.20, 21, 22 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు,, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చు అని IMD పేర్కొంది.40-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

పెరుగుతున్న చలి:- రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతల్లో గత రెండు రోజుల నుంచి ఉష్టోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువ నమోదు అవుతున్నాయి. అల్లూరి జిల్లా చింతపల్లిలో 9.4 డిగ్రీలు, పాడేరు,అరకులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.చింతపల్లి ఏజెన్సీలో సాయంత్రం నుంచే మంచు కురుస్తోంది. పొగమంచుతో మన్యం ప్రాంత వాసులు వణికిపోతున్నారు.శనివారం నుంచి చలి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వివరించింది. పగటిపూట పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

6 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

10 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

10 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

10 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.