AMARAVATHI

భారత్ కు చేరుకున్నఉక్రెయిన్ మంత్రి జాపరోవా

అమరావతి:  ఉక్రెయిన్ పై రష్యా సైనికి చర్యలు తీవ్రస్థాయికి తీసుకుని వెళ్లుతున్న సమయంలో ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తొలి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవా సోమవారం భారత దేశానికి చేరుకున్నారు..అమె న్యూఢిల్లీలో నాలుగు రోజుల పాటు పలువురు నేతలను కలుసుకోనున్నారు..భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మతో, ఎమిన్ జాపరోవా చర్చలు జరపనున్నారు..సైనికి చర్యలు చోటుచేసుకున్న సమయంలో ఆమె భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది..రష్యా,,ఉక్రెయిన్ ల మధ్య సైనిక చర్య,, భారత్-ఉక్రెయిన్ మధ్య సత్సంబంధాలు, అంతర్జాతీయ సమస్యలు వంటి అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం.. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖితో కూడా ఎమిన్ జాపరోవా సమావేశంలో పాల్గొననున్నారు..

జాతీయ భద్రతా ఉప సలహాదారు విక్రమ్ మిస్రీతోనూ ఆమె సమావేశం కానున్నారు..ఉక్రెయిన్ విదేశాంగ శాఖ మొట్టమొదటి డిప్యూటీ మంత్రి ఎమిన్ జాపరోవాకు భారత్ లోకి స్వాగతం పలికామని,, ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలు, సహకారంపై చర్చించామని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి సంజయ్ వర్మ ట్విట్టర్ లో తెలిపారు..ఆమె పర్యటన విజయవంతం అవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు..రష్యా-ఉక్రెయిన్ సైనిక చర్యలపై భారత్ ఇప్పటికే పలుసార్లు స్పందించింది..చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలుసార్లు ఫోనులో సంభాషించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.