HEALTH

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

అమరావతి: మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది..ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో దాదాపు 16.000 మంది మంకీపాక్స్ బారిన పడ్డారు..మంకీ పాక్స్‌ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు  పేర్కొంటున్నారు..ఈ వ్యాధి ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశం తక్కువగా ఉంటుందని,, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రోగిని నాలుగు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు..వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని,,జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని,,ఇవే లక్షణాలు మంకీపాక్స్‌ ఉన్న వారిలో ఉంటాయని తెలిపారు..మెడ భాగం, చంకలు, గజ్జల్లో బిళ్లలు కట్టడమనేది ఈ వ్యాధి ప్రత్యేకతని వెల్లడించారు..రోగికి అతి దగ్గరగా ఉన్న వారికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని,,వ్యాధి సోకిన వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లు, దుస్తులు, వాడే వస్తువులను నుంచి ఈ వ్యాధి సోకుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. చిన్నపిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు..స్మాల్‌ పాక్స్‌ వ్యాధికి, మంకీపాక్స్‌ వ్యాధికి దగ్గర సారూప్యత ఉందని తెలిపారు.

రెండు వారాలు:- మంకీపాక్స్‌ సోకిన వ్యక్తికి 1 నుంచి 2 వారాలు జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి..చంకలు, మెడ భాగం, గజ్జల్లో బిళ్లలు కట్టడం ఈ వ్యాధి ప్రత్యేక లక్షణం,,ఇదే సమయంలో రోగికి లక్షణాలు పెరిగేకొద్ది ముఖం, చేతులు, ఛాతీ భాగాల్లో చిన్న చిన్న పొక్కులు కనిపిస్తాయి..వాటి స్థానంలో చిన్న చిన్న గుంటు ఏర్పడతాయి..

తెలుగు రాష్ట్రల్లో పెద్దమ్మ,నూకలమ్మ,అంట్లమ్మ లాంటి వ్యాధులు వచ్చినప్పుడు పాత తరం వాళ్లు వివిధ జాగ్రత్తలు తీసుకునే వాళ్లు..మాంసాహారంకు దూరంగ వుండడం,,బాధితుడికి మైలు తగలకుండా జాగ్రత్తలతో పాటు తేలికగా జీర్ణం అయ్యే ఆహారం ఇచ్చి,,రెండు వారాల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లనిచే వారు కాదు..

నేటి పరిస్థితుల్లో ఇలాంటి లక్షణాలు కన్సిస్తే,,వైద్యుల పర్యవేక్షణలో ఉండి మందులు వాడితే తొందరగా కోలుకుంటారు. వ్యాధి లక్షణాలు ఉంటే దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

9 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

9 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

1 day ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

1 day ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.