AMARAVATHI

వైఎస్ వివేకా హాత్య కేసులో కొత్త సీబీఐ విచారణ బృందం

అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం విచారణ చేస్తున్న సీబీఐ బృందం మొత్తాన్ని ఉన్నతాధికారులు మార్చేశారు..ఈ మేరకు మార్చి 29వ తేదీ బుధవారం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ ప్రకటించింది..ప్రస్తుతం ఈ కేసులో విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను తప్పించి,,ఆయన స్థానంలో సీబీఐ డీఐజీ చౌరాసియాను నియమించారు..కొత్త టీంలో సభ్యులుగా ఎస్పీ వికాశ్ సింగ్,,ఏఎస్పీ ముఖేష్ కుమార్, ఇన్ స్పెక్టర్లుగా ఎస్.శ్రీమతి,,పునియా,, ఎస్ఐ అంకిత్ యాదవ్ లతో ఆరుగురు సభ్యులతో టీం ఏర్పాటు చేశారు..ఇక నుంచి వీరి ఆధ్వర్యంలోనే హత్య కేసు విచారణ కొనసాగనుంది.. ఏప్రిల్ 30వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో, కొత్త టీం వెంటనే బాధ్యతల స్వీకరించనున్నది..నెల రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రతిరోజూ విచారణ చేయాలని కొత్త టీం నిర్ణయించికున్నట్లు తెలుస్తొంది.. 

ఇప్పటి వరకు కేసు విచారణ అధికారిగా ఉన్న రాంసింగ్ ను మార్చాలంటూ కేసులోని A5 నిందితుడిగా ఉన్న శంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేసింది..విచారణ బృందాన్ని తప్పించాలని ఆదేశిస్తూ, దర్యాప్తు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది..మూడేళ్లుగా విచారణ సాగుతున్నా, ఎలాంటి పురోగతి లేనప్పుడు రాంసింగ్ ఉండి ఉపయోగం ఏంటని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.. ఈ నేధ్యంలో సీబీఐ ఉన్నతాధికారులు, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను చౌరాసియా ఆధ్వర్యంలోని కొత్త టీంకు అప్పగించారు.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

19 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

23 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

23 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

23 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

2 days ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.