INTERNATIONAL

మాంగ్రోవ్ ఫారెస్ట్ లో మొక్కలు నాటిన ప్రధాని మోదీ

G 20 సమ్మిట్..

అమరావతి: ఇండోనేషియాలో రెండవ రోజు G 20 సమ్మిట్ కొనసాగుతోంది. మాంగ్రోవ్ ఫారెస్ట్ లో వివిధ దేశాల అగ్రనేతలు సమావేశం కాగా ఈ గ్రూప్ లో (మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్) భారత్ చేరింది. ఈ సందర్బంను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, మాంగ్రోవ్ ఫారెస్ట్ ను సందర్శించి,ఇతర దేశాధినేతలతో కలసి మొక్కలు నాటారు. మంగళవారం ఎన్వీరాన్ మెంటల్,, హెల్త్ అంశాలపై చర్చించనున్నారు. ఇండోనేషియా ప్రధాని విడోడో, స్పెయిన్ ప్రధాని పెడ్రో, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో పాటు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. సోమవారం జరిగిన సదస్సులో వివిధ దేశాధినేతలతో ప్రధానిమోడీ సమావేశమై,, దౌత్య సంబంధాలు, అభివృద్ధి సహా వివిధ అంశాలపై చర్చించారు. గాల్వాన్ ఘటన తరువాత మొదటి సారి G 20 సమ్మిట్ లో భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సమావేశమయ్యారు.తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధానిమోడీ  భేటీ అయ్యారు. రెండు దేశాల వ్యూహత్మక సంబంధాలపై ఇద్దరు సమీక్ష నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతోపాటు రష్యా, ఉక్రెయిన్ యుద్దంపై భేటీలో చర్చించారు. G 20 సదస్సులో బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్,  ప్రధానిమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని,భారత్ ప్రతిభకు ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలకు భారత సంతతి వ్యక్తులే సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ప్రపంచ శాంతి కోసం అందరు కలిసి కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.నేడు G 20 ముగింపు సభలో ఇండోనేషియా  G 20 అధ్యక్ష బాధ్యతలు భారత్ కు అప్పగిస్తుంది.

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

11 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

14 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

14 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

15 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

2 days ago

This website uses cookies.