DISTRICTS

మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల పథకం-కలెక్టర్

నెల్లూరు: జిల్లాలో మైనార్టీల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో  కలెక్టర్ ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి వికాస్ పథకంలో భాగంగా చేతివృత్తులతో జీవనోపాధితో  పొందుతున్న వారికి చేయూత నివ్వాలన్నారు.ముఖ్యంగా ఉదయగిరిలోని చెక్కనగిషి కేంద్రం ద్వారా 300 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్న దృష్ట్యా ఆ భవన మరమ్మతులు, యంత్రాల సరఫరా కోసం అవసరమైన నిధులను సమకూర్చుడం కోసం త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. అక్కచెరువుపాడులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 480 సీట్లకు గాను 300 మంది విద్యార్థులు ఉన్నారని , ఆ పాఠశాలలో పూర్తిస్థాయిలో సీట్లను భర్తీ చేసి విద్యా వ్యాప్తికి తోడ్పడాలన్నారు.ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం క్రింద గురుకులాలు, పరిపాలనా భవనాలు, ఐటిఐ భవనాలు, వసతి గృహాల భవనాలు నిర్మాణం వంటి వివిధ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన 47 కోట్ల రూపాయలకు మరలా టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలన్నారు..ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శ్రీమతి కనకదుర్గ భవాని, మైనార్టీ కార్పొరేషన్ ED నారాయణ,  ZP CEO శ్రీమతి వాణి,DEO రమేష్,,DRDA,డ్వామా, హౌసింగ్ PDలు సాంబశివరెడ్డి,తిరుపతయ్య, నరసింహం,డి MNHO ఓ డాక్టర్ పెంచలయ్య తదితరలు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

21 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

21 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.