DISTRICTS

తిరుపతి నగరంలో నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు-ఎమ్మెల్యే భూమన

తిరుపతి: వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు తావు లేకుండా మీ న్యాయమైన కోరిక, మీ జీవితాల భద్రత దృష్టిలో ఉంచుకొని మీ ప్రాంత స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగింపుపై సీ.ఎం జగన్ దృష్టికి  తీసుకువెళ్లి పరిష్కరించడం జరిగిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక 45 వ వార్డు జీవకోన ముత్తు మారెమ్మ గుడి వద్ద సంబంధిత స్థలాల నిషేధిత జాబితా నుంచి తొలగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ గత పాలకులు 2018లో ఉద్దేశపూర్వకంగా మీకు సంబంధించిన ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంచారని మీరు తెలియజేసిన అభ్యర్థనల మేరకు ముఖ్యమంత్రితో చర్చించి సమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. 45వ వార్డుకు సంబంధించిన శివ జ్యోతి నగర్ , అయ్యప్ప కాలనీ, ప్రగతి నగర్ , భూపాల్ నగర్ లోని  695/2 నుండి 700/ 1 బి 2 సర్వేనెంబర్లలో 36.10 ఎకరాల్లో నివాసముంటున్న 950 కుటుంబాలకు లబ్ధి కలిగేలా వారి స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగించి కంప్యూటర్ బటన్ నొక్కి రిజిస్ట్రేషన్ జరిగేలా అవకాశం కల్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేడు చట్టబద్ధతగా 22A నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామన్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. నేడు గత 40 సంవత్సరాల కిందటి స్వాతంత్ర సమరయోధుల భూములైన 36.10 ఎకరాలను నిషేధిత జాబితా నుండి తొలగించామని, మరో 38 ఎకరాలు ప్రభుత్వ భూముల సంబంధించినది మరో 30 రోజుల్లోపరిష్కరిస్తామని, OTS విధానంతో రిజిస్ట్రేషన్ ల సౌకర్యం కల్పిస్తామని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

4 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

This website uses cookies.