AMARAVATHI

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోండి- దీపక్ మిశ్రా

నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులకు దీపక్ మిశ్రా పోలీస్ అధికారులను  ఆదేశించారు. మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోలీసు అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దీపక్ మిశ్రా మాట్లాడుతూ సాధారణ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని పోలీసులకు సూచించారు. ఎన్నికల్లో రాజకీయాలకు,కుల మతాలకు అతీతంగా పోలీసు అధికారులు పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు శాంతియుత వాతావరణం ఎన్నికల నిర్వహించడానికి పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా నిలబడి ఉండకుండా ప్రశాంతంగా ఓటుకు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆయన అన్నారు. పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూములకు వెళ్లే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వాహనాలు మార్గమధ్యంలో ఆపకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు స్ట్రాంగ్ రూములకు తీసుకువెళ్లే వాహనాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్:- ఎం.హరి నారాయణన్ మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో 8 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయన్నారు. జిల్లాలో పోలింగ్ నిర్వహించడానికి2వేల 470 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఒకే ప్రాంతంలో మూడు, నాలుగు పోలింగ్ కేంద్రాలు ఉన్నచోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది ఓటు హక్కును విని యోగించుకోవడానికి ఫేసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్.పి- ఆరిఫ్ హ ఫీస్ మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా 18 చెక్ పోస్ట్లను ఏర్పాటు చేశామన్నారు.జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో3ఎస్.ఎస్.టి మరియు 3ఎఫ్.ఎస్.టి  టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. జిల్లాలో 2వేల470 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. వీటిలో 450 సమస్య పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పోలీస్ సిబ్బందితో పాటు ఎన్.ఎస్.ఎస్ మరియు ఎన్. సి.సి వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. ఎన్నికల సందర్భంగా అనుమానం ఉన్న వ్యక్తులను బైండోవర్ చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో లైసెన్స్ ఉన్న తుపాకులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ బృందాలు  సంఘటనలు జరిగిన పది నిమిషాల్లో ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుంటారని ఆయన తెలియజేశారు. ఈ  సమావేశంలో జిల్లా ప్రత్యేక పోలీస్ పరిశీలకులు అశోక్ టి దూదే, గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, జిల్లా అదనపు ఎస్పి సౌజన్య, నెల్లూరు టౌన్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి, రూరల్ డిఎస్పి వీరాంజ నేయరెడ్డి, కావలి డిఎస్పి ప్రసాదు, ఆత్మకూరు డిఎస్పి కోటారెడ్డి ,కందుకూరు డిఎస్పి ఏ.శ్రీనివాస్, ఏ.ఆర్  డి.ఎస్.పి పి. వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ డిఎస్పి ఏ. శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.   

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

39 mins ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

5 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

24 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

1 day ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 day ago

This website uses cookies.