AMARAVATHI

వైసీపీ రాక్షస పాలను నుంచి రాష్ట్రంను కాపాడడమే లక్ష్యం-ఎన్డీయే నేతలు

అమరావతి: టీడీపీకి అనుభవం వుందని,,జనసేనా పోరాడే శక్తి వుందని,,బీజెపీకి దేశంను సమైక్యంగా అభివృద్ది దిశగా నడిపే శక్తి వుందని కూటమి నాయకులు చంద్రబాబు,పవన్,పురంధేశ్వరి అన్నారు.బుధవారం వైసీపీను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలతో ప్రజలను చైతన్య పరిచేందుకు కూటమి నేతలందరూ కలిసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగే తణుకు, నిడదవోలు సభలలో బుధవారం పాల్గొన్నారు..ఈ సందర్బంలో పవన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో తణుకు అవినీతి నేలగా మారిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..స్థానిక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విమర్శించారు..అవినీతి సొమ్మును మంత్రి హైదరాబాద్ తరలించి,,బాలానగర్‌లో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు చెబితే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చిన్న చూపు చూశారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు..దేశానికి అన్నం పెట్టే రైతును మంత్రి ఏడిపించారని గుర్తుచేశారు..అలాంటి మంత్రి కుమారుడు ఎన్నికల బరిలో ఉన్నారని, అతనికి బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఇరిగేషన్ మంత్రి డ్యాన్సులు చేస్తాడని,,బూతులు తిట్టే మరో మంత్రి ఉన్నాడని మండిపడ్డారు.. మధ్య తరగతి వారు, పేదల సమస్యలు తనకు తెలుసు అని పవన్ కల్యాణ్ అన్నారు..ఉద్యోగుల సీపీఎస్ సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని,,కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోపు పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 hour ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

7 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

22 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

22 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.