AMARAVATHI

న్యాయవాద వృత్తిలో రాణించాలంటే కొన్నిసమయాల్లో మౌనంగా ఉండడం ముఖ్యం- జస్టిస్ శేషసాయి

నెల్లూరు: న్యాయవాద వృత్తిలో రాణించాలంటే బాగా వాదించగలగడంతో పాటు కొన్ని సమయాల్లో సందర్భానుసారంగా మౌనంగా ఉండడం అనేది చాలా ముఖ్యమని రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ వి శేష సాయి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో నూతన న్యాయస్థాన భవనాలను హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ తో కలసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో జస్టిస్ శేషసాయి మాట్లాడుతూ తక్కువ వ్యవధిలోనే భవన నిర్మాణాలను పూర్తిచేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలన్నారు. ముఖ్యంగా జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ డి రమేష్ తదితరులు ఎంతో కృషి చేశారని ప్రశంశించారు. పనిచేసే ప్రదేశం బాగుంటేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. న్యాయమూర్తుల నుండి మంచి మంచి తీర్పులు వస్తున్నాయంటే ఆయా న్యాయవాదులు మంచిగా వాదిస్తున్నారని అర్థమన్నారు. బార్ అసోసియేషన్ బాగుంటేనే బెంచ్ కూడా బాగుoటుందన్నారు. సీనియర్ న్యాయవాదులు ఎక్కడైతే గౌరవింపబడతారో ఆయా బార్ అసోసియేషన్లు బాగుంటాయన్నారు. మెరికల్లాంటి న్యాయవాదులను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి డాక్టర్ యామిని, జిల్లా ఎస్ పి తిరుమలేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, బార్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉమామహేశ్వర్, నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాద గుమస్తా అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

3 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

3 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

5 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.