AMARAVATHI

విజయనగరం జిల్లా వద్ద రెండు రైళ్లు ఢీ-ఆరుగురు మృతి పలువురికి గాయాలు

ఘెర ప్రమాదం..
అమరావతి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వేజంక్షన్ వద్ద రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి పలాస ప్యాసింజర్ రైలు ఢీకొంది..రాత్రి 7.10 గంటల సమయంలో సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్ ను పలాస ప్యాసింజర్ ఢీ కొనడంతో, పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ 3 బోగీలు చెల్లాచెదురయ్యాయి..ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారం.. క్షతగాత్రులను చికిత్త నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు.. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని,,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది వెల్లడించారు.. ప్రమాదం కారణంగా విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతొంది..
ఈ ప్రమాదానికి సంబంధించి వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ మీడియాకు వివరాలు తెలియచేస్తు చీకటి కారణంగా సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని,,ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.. ప్రమాదంపై హెల్ప్ లైన్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.. క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు డీఆర్ఎం వెల్లడించారు..ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్స్:-హెల్ప్ లైన్ నెంబర్లు–0891 2746330,,0891 2744619…ఎయిర్ టెల్–
81060 53051,,81060 53052…bsnl-8500041670,,8500041671.. విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నెంబర్లు:-కేజీహెచ్ casuality No.8912558494…2. డాక్టర్ @ కేజీహెచ్ మొబైల్ నెంబర్ 8341483151
3. డాక్టర్ @ కేజీహెచ్ casuality మొబైల్ నెం.8688321986.. బాధితుల వైద్య సాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.

ప్రమాదం వివరాలు పూర్తిగా తెలియాల్సి వుంది…

Spread the love
venkat seelam

Recent Posts

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 hour ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

19 hours ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

23 hours ago

ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు మున్సిపల్ కార్యాలయం.. అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు…

1 day ago

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

2 days ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

2 days ago

This website uses cookies.