NATIONAL

జ‌మ్మూక‌శ్మీర్‌ను సందర్శించిన 1.62 కోట్ల మంది టూరిస్టులు

అమరావతి: జ‌మ్మూక‌శ్మీర్‌ను ఈ సంవత్సరం ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసిన‌ట్లు జ‌మ్మూక‌శ్మీర్‌ టూరిజం శాఖ అధికారి వెల్ల‌డించారు. ఆర్టికల్ 370,35B ని తొలగించి, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన తరువాత, జ‌మ్మూక‌శ్మీర్‌లో అభివృద్ధి వేగంగా జ‌రుగుతోంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న్నారు. 30 సంవత్సరాల తరువాత మ‌ళ్లీ అధిక స్థాయిలో ల‌క్ష‌లాది మంది టూరిస్టులు క‌శ్మీర్‌కు వ‌స్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.క‌శ్మీర్ టూరిజంలో మ‌ళ్లీ స్వ‌ర్ణ‌యుగం మొద‌లైందని, జ‌మ్మూక‌శ్మీర్‌ ప్రాంత ప్రజలకు టూరిజ‌మే అతిపెద్ద ఉపాధి అన్నారు.2022 జ‌న‌వ‌రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 1.62 కోట్ల మంది ప‌ర్యాట‌కులు క‌శ్మీర్‌ను సందర్శించారని, 75 ఏళ్ల స్వాతంత్య్ర భార‌త్‌ చరిత్రలో అత్య‌ధిక స్థాయిలో ప‌ర్యాట‌కులు రావ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్పారు. ఈ ఏడాది తొలి 8 నెల‌ల్లోనే రికార్డు స్థాయిలో 20.5 ల‌క్ష‌ల దేశీయ టూరిస్టులు వ‌చ్చారని,ఇందులో 3.65 ల‌క్ష‌ల మంది అమ‌ర్‌నాథ్ యాత్రికులు ఉన్న‌ట్లు వెల్లడించారు. ప‌హ‌ల్గామ్‌, గుల్మార్గ్‌, సోనామార్గ్ లాంటి టూరిస్టు ప్రాంతాల్లో హోట‌ళ్లు, గెస్ట్‌ హౌజ్‌లు నూటికి నూరు శాతం నిండిపోయాయి అని తెలిపారు. టూరిజం వ‌ల్ల పూంచ్‌, రాజౌరి, జ‌మ్మూ, క‌శ్మీర్ లోయ‌లో భారీ సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు స్థానికులు పొందారన్నారు.చిత్ర నిర్మాణానికి సంబంధించి, స‌మ‌గ్ర‌మైన ఫిల్మ్ పాల‌సీని కూడా రూపొందించమని, ఈ సారి 140 సినిమా షూటింగ్‌ల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

45 mins ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

22 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

This website uses cookies.