AMARAVATHI

రబీకి 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల

నెల్లూరు: జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్  దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డితో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం  నిర్వహించారు.అనంతరం పలువురు రైతు సంఘాల నాయకులు, రైతులు మాట్లాడుతూ రెండో పంటకు విత్తనాలను ఇబ్బందులు లేకుండా అందించాలని, టార్పాలిన్ పట్టాలను సబ్సిడీపై అందజేయాలని, పంట కాలువలకు  పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండో పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని, రెండు రిజర్వాయర్లలో కూడా నీరు అందుబాటులో ఉందని చెప్పారు. రైతులందరూ తక్కువ నీటి వినియోగంతో పండే చిరుధాన్యాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని, ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం శుభపరిణామమని, రైతులందరూ కూడా చిరుధాన్యాల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎక్కువగా వరి వేయకుండా చిరుధాన్యాలు, పత్తి, వేరుశనగ పంటలపై దృష్టి సారించాలని రైతులకు ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.

జిల్లాలో సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్సీగా పనిచేసిన వాకాటి నారాయణరెడ్డి పదవీ కాలం  ముగియడంతో ఆయనను మంత్రి, కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

 చివరిగా రైతులకు ఓదెలు (చిరుధాన్యాలు) విత్తనాలను మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో రైతులకు ఉపయోగపడేలా వ్యవసాయ శాఖ రూపొందించిన వ్యవసాయ, అనుబంధ శాఖల నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక 2023-24 పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఈ సమావేశాల్లో ప్రజా ప్రతినిధులు,రైతు సంఘాల నాయకులు, రైతులు, జిల్లాస్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

14 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

17 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

17 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

19 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.