AMARAVATHI

ఒంగొలు,బాపట్ల మధ్య హైవేపై ల్యాండ్ అయిన మిలటరీ విమానం

ట్రయిల్ రన్ సకెస్స్..ఎయిర్ ఫోర్స్…

అమరావతి: ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లాలా నుంచి వెళ్లుతున్న 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన,, హెలికాప్టర్లు ల్యాండ్ అండ్ టేకాప్ లు జరిగాయి..ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్మించిన 6 లైన్ల జాతీయ రహదారులు,,దేశం అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో,,విమానాలు, హెలికాప్టర్లు…. ల్యాండింగ్‌, టేకాఫ్‌ చేసేందుకు అనువుగా మలిచారు..దింతో 15 నెలల వ్యవధిలో రెండు సార్లు సక్సెస్‌ఫుల్‌గా ట్రయల్‌ రన్‌ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించింది.. 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌ పాస్‌ వరకు,, అలాగే బాపట్ల జిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు హైవేనే రన్‌వేగా వున్నాయి..ఈ రెండు రోడ్‌ కమ్‌ రన్‌వేలలో తొలుత బాపట్ల జిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు,, కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్‌ పాస్‌ వరకు ఉన్న రన్‌వేపై సోమవారం 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై బాపట్లజిల్లా కొరిశెపాడు దగ్గర తాజాగా నిర్వహించిన రెండో ట్రయల్‌ రన్‌లో 8 యుద్ద విమానాలు పాల్గొన్నాయి. మొదట ఈ విమానాల ల్యాండింగ్‌ కోసం ఓ హెలికాప్టర్‌ ద్వారా రెండు సార్లు చక్కర్లు కొడుతూ పరిస్థితిని సమీక్షించారు..వాతావరణం అనుకూలంగా ఉండటంతో విమానాల ల్యాండింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు..దీంతో తొలుత SU-30 పేరుతో పిలిచే 4 సుఖోయ్‌ యుద్ద విమానాలు హైవేపై తక్కువ ఎత్తులో ఎగురుతూ వెళ్ళాయి..ఆ తరువాత రెండు హక్‌ యుద్ద విమానాలు రోడ్డుకు కేవలం 3 అడుగుల ఎత్తులో ఎగురుతూ వెళ్ళాయి.. ఈ రెండురకాల యుద్ద విమానాలను పూర్తిస్థాయిలో హైవేపై ల్యాండింగ్‌ చేయలేదు..చివరిగా వచ్చిన రెండు కార్గో విమానాలను మాత్రం రన్‌వేపై ల్యాండింగ్‌ చేశారు..ల్యాండింగ్‌ అయిన తరువాత కొద్దిదూరం రన్‌వేపై ప్రయాణించి తిరిగి యూటర్న్‌ తీసుకుని వచ్చిన దారినే టేకాఫ్‌ అయి వెళ్ళిపోయాయి..ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన రాడార్లు, ఇతర ఏవియేషన్‌ పరికరాలను హైవేపక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు.. ట్రయల్‌ రన్‌ పూర్తి స్థాయిలో విజయవంతం అయిందని ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ప్రకటించారు.

(16వ నెంబర్‌ జాతీయ రహదారిపై ప్రకాశంజిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా కొరిశెపాడు దగ్గర రెండు ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 4 కిలోమీటర్ల పరిధిలో అత్యవసర రెండు ఎయిర్ ప్యాడ్లను నిర్మించారు..విమానాల ల్యాండింగ్‌ కోసం 4 కిలోమీటర్ల మేర రన్‌వేను దృఢంగా, సౌకర్యవంతంగా నిర్మించారు. జాతీయ రహదారిపై 60 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు. వీటిని నిర్మించే ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌,,రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాలు,, బస్‌ బే,, చెట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు..రన్‌వేకు ఆనుకుని ప్రధాన రహదారిపై విమానాల ల్యాండింగ్‌ కోసం పార్కింగ్ స్లాట్స్ కూడా నిర్మించారు).

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు బ్రహ్మరథం పట్టిన విజయవాడ ప్రజలు

అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్‌ స్టేడియం…

17 hours ago

ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అనుమతి- కలెక్టర్‌

బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…

17 hours ago

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

20 hours ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

20 hours ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

20 hours ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

21 hours ago

This website uses cookies.