DISTRICTS

ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి-కలెక్టర్

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో మానసిక ఒత్తిడితో పాటు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారని,వారందరికీ వైద్య సేవలు అందించేందు కోసం ప్రత్యేకించి ఒక దీర్ఘకాలిక వ్యాధుల ఔట్ పేషంటు విభాగాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అన్నారు.సోమవారం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) క్రింద ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీర్ఘకాలిక వ్యాధుల ఔట్ పేషంట్ విభాగాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నుంచి శనివారం వరకు,,ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ విభాగం పనిచేసేలా చూడాలన్నారు.. ఉద్యోగులను ఎవరిని వేచి ఉండేలా చేయకుండా త్వరగా పరీక్షించి పంపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు..జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.అంతకు మునుపు GGH పర్యవేక్షకులు డాక్టర్.సిద్ధానాయక్ మాట్లాడుతూ ఓపి విభాగంలో డాక్టర్ కన్సల్టేషన్ గది, రిసెప్షన్ గది, వివిధ రకాల నమూనాల పరిశీలించే ప్రయోగశాల ఉన్నాయని కలెక్టర్ కు వివరించారు. డాక్టర్ల  సూచన మేరకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.జనరల్ మెడిసిన్,ఎముకలు కీళ్లు,మానసిక,చర్మ,ఉదరం,గుండె సంబంధ వ్యాధులు ఎండోక్రైనాలజీ ఊపిరితిత్తులు మూత్రపిండాలు, మధుమేహం, రక్తపోటు,పార్కిన్ సన్,మూర్ఛ తదితర 24 రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమన్వయకర్త శ్రీమతి లక్ష్మీ సునంద, సభ్యులు, పలువురు ప్రొఫెసర్లు పారామెడికల్, నర్సింగ్, ఫార్మసీ సిబ్బంది,ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

2 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

17 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

17 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

23 hours ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.