AMARAVATHI

ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ను శుక్రవారం అందుకున్నారు.. భూటాన్ దేశ అత్యున్నత పౌర గౌరవాన్ని అందుకున్న మొదటి విదేశీ ప్రభుత్వాధినేత ప్రధాని మోదీ కావడం విశేషం..భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్ ప్రధాని మోదీని ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’తో సత్కరించారు..ఈ గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ గౌరవాన్ని 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.. భూటన్ లోని థింపూలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ “ఈ గౌరవం నా వ్యక్తిగత విజయం కాదు, ఇది 140 కోట్ల మంది భారతీయుల గౌరవం…భూటాన్ భూటాన్‌లోని భారతీయులందరి తరపున ఈ గౌరవాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను… ఈ గౌరవానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’’ అని అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం మార్చి 22న భూటాన్‌కు చేరుకున్నారు ప్రధాని మోదీ. భారతదేశం – భూటాన్‌ల మధ్య క్రమం తప్పకుండా ఉన్నత స్థాయి మార్పిడి సంప్రదాయానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతోంది. పారో విమానాశ్రయంలో ప్రధానికి ప్రధాని షెరింగ్ టోబ్గే ఘనస్వాగతం పలికారు.

భూటాన్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అతిథ్యం లభించింది. ఇంతకు ముందు ఏ భారత ప్రధానికి భూటాన్ రాజు ప్రైవేట్ విందు ఇవ్వలేదు..భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యాల్ వాంగ్‌చుక్, ప్రధాని మోదీకి ఈ ప్రత్యేక హోదాను కల్పించారు.. కె5 రెసిడెన్స్ లింగనా ప్యాలెస్‌లో భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.. అలాగే విదేశీ ప్రతినిధికి భూటాన్ అత్యున్నత పురస్కారం ఇవ్వడం సైతం ఇదే తొలిసారి..

 

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

3 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

3 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

5 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

1 day ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.